Bigg Boss 6 Telugu- Adi Reddy- Inaya Sultana: ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం ఎంత హీట్ మీద ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి ఇంట్లో స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తుంది..గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి సూర్య ని ఎలిమినేట్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఒక షాకింగ్ ఎలిమినేషన్..ఎందుకంటే సూర్య మొదటి నుండి ఇంట్లో మంచి ఎంటర్టైనర్ మరియు ఎలాంటి టాస్కు ఇచ్చిన అద్భుతంగా ఆడగలిగే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకడు.

దానికి తోడు హౌస్ మేట్స్ తో అతను నడుచుకునే విధానం కూడా ఎంతో వినయంగా ఉంటుంది..అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ సూర్య ని అంతలా ఇష్టపడుతారు..ముఖ్యంగా హౌస్ లో లేడీస్ ఫాలోయింగ్ గట్టిగా ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఇతనే..అలాంటి వాడు ఎలిమినేట్ అవ్వడం నిజంగా షాక్ అనే చెప్పాలి..సూర్య ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఇనాయ సుల్తానా అని చెప్పొచ్చు.
ఎందుకంటే పోయినవారం సూర్య ని నామినెటే చేసింది ఇనాయ మరియు వాసంతి మాత్రమే..కానీ సూర్య హౌస్ నుండి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం వెక్కిళ్లు పెట్టిమరీ ఏడ్చేసింది ఇనాయ సుల్తానా..ఇది ఇంటి సబ్యులకు మాత్రమే కాదు..చూసే ప్రేక్షకులకు కూడా బాగా ఫేక్ అనిపించింది..ఈరోజు జరిగిన నామినేషన్స్ లో ఇంటి సభ్యులందరూ ఇదే విషయం మీద ఇనాయ ని నామినేట్ చేసారు..ముఖ్యంగా ఆది రెడ్డి నామినేట్ చేస్తూ ‘నువ్వు నాకు ఫేక్..ఫేకస్య..ఫెకోబ్యాహా అనిపించింది..గత వారం సూర్య ని నామినేట్ చేసింది ఎవరు’ అని ఇనాయ ని అడుగుతాడు..అప్పుడు ఇనాయ ‘నేను వాసంతి నామినేట్ చేసాము’ అని బదులిస్తుంది.

అప్పుడు ఆది రెడ్డి మాట్లాడుతూ ‘అతను వెళ్లిపోతుంటే కిందపడి దొర్లాడి ఏడ్చావు..సూర్య వెళ్ళిపోతే అంత బాధపడుతాను అని నువ్వు అనుకున్నప్పుడు అతనిని ఎందుకు నామినేట్ చేసావు’ అని అడుగుతాడు..అప్పుడు ఇనాయ దానికి సమాధానం చెప్తూ ‘అది నా ఇష్టం’ అంటుంది..రేవంత్ కూడా మరియు మిగిలిన ఇంటి సభ్యులు కూడా ఈ కారణం చేతనే ఇనాయ ని నామినేట్ చేసారు.
