Bigg Boss 6 Telugu 11th Week Elimination: బిగ్ బాస్ షో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ఎపిసోడ్లో ఎవిక్షన్ పాస్ కోసం కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో బజర్ ప్రెస్ చేసిన ఫైమా, శ్రీహాన్, రేవంత్ ఎవిక్షన్ పాస్ కొరకు నిర్వహించిన పోటీలో నిలిచారు. దీనిలో భాగంగా ముగ్గురు తమ భుజాలపై ఒక కర్రను మోయాల్సి ఉంటుంది. మిగిలిన ఇంటి సభ్యులు కారణాలు చెప్పి ఎవిక్షన్ పాస్ దక్కకూడదని భావించిన కంటెస్టెంట్ మోస్తున్న కర్రకు బరువు తగిలించాలి. ప్రతి కంటెస్టెంట్ మూడు బ్యాగులు తమ అభిప్రాయం ప్రకారం పోటీలో ఉన్న కంటెస్టెంట్స్ మోస్తున్న కర్రలకు తగిలించాలి.

ఈ టాస్క్ లో ఫైమా అమ్మాయి కావడంతో మెజారిటీ కంటెస్టెంట్స్ ఆమెకు సప్పోర్ట్ చేశారు. ఒక శ్రీసత్య మాత్రమే ఫైమాకు వ్యతిరేకంగా రెండు బ్యాగ్స్ ఫైమా భుజాలపై ఉన్న కర్రకు తగిలించింది. బరువులు మోస్తున్న ఫైమా, రేవంత్, శ్రీహాన్ లలో ఎవరు చివరి వరకు ఉంటారో వారికి ఎవిక్షన్ పాస్ దక్కుతుంది. శ్రీహాన్, రేవంత్ అధిక మొత్తంలో బరువు మోయాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. శ్రీహాన్ మొదట మోయలేక క్రింద పడేశాడు. రేవంత్ చాలా వరకు ప్రయత్నం చేసి ఓటమి చెందాడు. ఫైమా భుజాలపై ఉన్న కర్రకు కేవలం రెండు బ్యాగ్స్ మాత్రమే తగిలించారు. దీంతో ఆమె వారిద్దరి కంటే ఎక్కువ సమయం బరువు భుజాలపై ఉంచుకొని టాస్క్ లో గెలిచింది.
ఫైమా ఎవిక్షన్ పాస్ దక్కించుకుంది. దీన్ని వాడుకొని ఫైమా ఎలిమినేషన్ నుండి బయటపడొచ్చు. లేదా ఎలిమినేషన్ నుండి మరొకరిని కాపాడొచ్చు. కాగా ఈ వారం ఎవరు ఎలిమినేషన్ గురించి సమాచారం బయటకి వచ్చింది. ఆదివారం మెరీనా ఎలిమినేట్ కానుంది అంటున్నారు. ఓటింగ్ లో ఆమె వెనుకబడ్డారని తెలుస్తుంది. ఓటింగ్ ప్రకారం రేవంత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఫైమా సెకండ్ ప్లేస్ కి దూసుకొచ్చిందట. శ్రీహాన్ కి షాక్ ఇచ్చిన ప్రేక్షకులు ఆరో స్థానానికి పరిమితం చేశారట.

ఇక కీర్తి నాలుగో స్థానంలో, ఆదిరెడ్డి ఐదో స్థానంలో కొనసాగుతున్నారట. 7,8 స్థానాల్లో శ్రీసత్య, మెరీనా ఉన్నారట. శ్రీసత్యపై భయంకరమైన నెగిటివిటీ నడుస్తున్నప్పటికీ మెరీనాను ఎలిమినేషన్ కి రంగం సిద్దమైందట. లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న రోహిత్-మెరీనా విడిపోతున్నారని అంటున్నారు. వచ్చేది ఫ్యామిలీ వీక్ కావడంతో శ్రీసత్యను ఎలిమినేట్ చేయకుండా అపారనే వాదన వినిపిస్తోంది. వీల్ చైర్ లో ఉన్న శ్రీసత్య తల్లిగారిని షోకి తీసుకొచ్చి ఎమోషన్ కురిపించి క్యాష్ చేసుకోవాలనేది నిర్వాహకుల అభిప్రాయమని తెలుస్తుంది.