Bigg Boss 6 Telugu 10th Week Nominations: బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం ఎంత హీట్ వాతావరణం లో కొనసాగుతుందో మన అందరం చూస్తూనే ఉన్నాము..కెప్టెన్సీ టాస్కులప్పుడు కానీ..నామినేషన్స్ అప్పుడు కానీ హౌస్ మొత్తం యుద్ధ వాతావరణం లో నడుస్తూ ముందుకు పోతుంది..అంతే కాకుండా గత కొద్ది వారాల నుండి ఊహించని ఎలిమినేషన్స్ కూడా జరుగుతుండడం..పోయినవారం గీతూ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులకు కూడా దిమ్మ తిరిగే షాక్ ని ఇచ్చింది..ఇక ఏ ముహూర్తాన సూర్య ఎలిమినేట్ అయ్యాడో కానీ..ఇనాయ కి నక్క తోక తొక్కినట్టు అయ్యింది.

ఆయన వెళ్ళిపోయినప్పటి నుండి ఇనాయ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది..దానికి తోడు ఇంటి సభ్యులలో అధికశాతం ఇనాయ ని టార్గెట్ చెయ్యడం తో ఆమె పై ప్రేక్షకుల్లో కూడా రోజు రోజుకి సానుభూతి పెరుగుతూ పోతూ ఇప్పుడు టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా మారిపోయింది..ఇక ఈ వారం అయితే ఆమెని ఏకంగా 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ చేసారు..కేవలం ఫైమా , బాలాదిత్య మరియు రోహిత్ మినహా ఇంటి సభ్యులందరూ ఇనాయ ని ఈ వారం నామినేట్ చేసారు.
ఫైమా ఇనాయ ని నామినేట్ చెయ్యకపోయినా..ఇనాయ మాత్రం ఫైమా ని నామినేట్ చేసింది..ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య హద్దులుమీరిన మాటల యుద్ధం నడించింది..ఇనాయ ఫైమా ని నామినేట్ చేస్తూ ‘మొన్న చేపల చెరువు టాస్కులో మరీనా మరియు బాలాదిత్య వాళ్ళ చేపలను కాపాడుకుంటున్న సమయం లో ఒకరి మీద ఒకరు ముందు నువ్వు ‘ఆ పడుకోండి..పడుకోండి’ అంటూ కామెంట్ చేసావు..అది నాకు నచ్చలేదు’ అని అంటుంది.

ఈ మాటకి ఫైమా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది..అప్పుడు ఆమె మాట్లాడుతూ ‘నీకు నిజంగా తెలుగు వచ్చా..లేకపోతే నీ మైండ్ సెట్ అంతేనా..ఒక కంటెస్టెంట్ మీద లేనిపోని ఆరోపణలు వేసి ఆదుకోవడమే నీ ఆటానా? ఎన్ని రోజులు ఇలాంటి ఆటతో సేఫ్ అవ్వాలనుకుంటున్నావ్’ అని అంటుంది..అలా వీళ్లిద్దరి మధ్య మాట మాట పెరిగి ఎక్కడికో పోతుంది..’నువ్వు ఫేక్ మనిషివి..నీ బుద్ది ఫేక్ బుద్ది..ఒకవేళ నేను ఆ మాట అని ఉంటె ఆరోజే నన్ను నిలదీసి అడిగేదానివి..కానీ నువ్వు అడగలేదు..ఎందుకంటే నువ్వు ఫేక్ కాబట్టి’ అని అంటుంది ఫైమా.
అప్పుడు ఇనాయ దానికి సమాధానం చెప్తూ ‘నేను ఫేక్ కాదు..నేను రియల్..నువ్వు ఫేక్..మొన్న కూడా నువ్వు నన్ను పిట్ట అని మాట్లాడుతూ డాష్ డాష్ అన్నావ్’ అంటుంది..అప్పుడు ఫైమా ఇనాయ ముందుకి వచ్చి ‘తు తూ’ అని ఊస్తుంది..తెలుగు రాకపోతే నేర్చుకో అని తిడుతుంది..అలా స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరు ఈరోజు నామినేషన్స్ లో భద్ర శత్రువులుగా మారి కొట్టుకున్నారు.