Bigg Boss 6 Telugu Neha: బిగ్ బాస్ లీక్స్ చాలా కామన్. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ముందుగానే సమాచారం బయటికి వచ్చేస్తుంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఇంటిని వీడే ఆ వ్యక్తి ఎవరనే ఆసక్తి కొనసాగుతుంది.ఈసారి టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. రేవంత్, బాల ఆదిత్య, గీతూ రాయల్, చంటి, నేహా చౌదరి, శ్రీహాన్, ఇనయా సుల్తానా హౌస్ మేట్స్ నుండి అత్యధిక వ్యతిరేక ఓట్లు సంపాదించి ఎలిమినేషన్ లోకి వచ్చారు. టాప్ సెలబ్రిటీలుగా షోలోకి ప్రవేశించిన సింగర్ రేవంత్, నటుడు బాల ఆదిత్య, చంటి ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. వాళ్లకు బయట భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఓట్లకు ఢోకా ఉండదు.

ఇక గీతూ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు. మొదటివారం నుండే తన ఆట పవర్ చూపిస్తున్న గీతూని నిర్వాహకులు బయటికి పంపే సాహసం చేయరు. ఇక మిగిలింది ఆరోహి రావు, నేహా, శ్రీహాన్, ఇనయా సుల్తానా. తాజా ఓటింగ్ ప్రకారం నేహా, ఇనయా సుల్తానా డేంజర్ జోన్ లో ఉన్నారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమంటున్నారు. ఇనయా హౌస్ ని వీడే అవకాశం కలదని అత్యధికుల అభిప్రాయం. అయితే మంచి గేమ్ చూపిస్తుంది.
ప్రతి టాస్క్ లో శక్తి వంచన లేకుండా ఆడుతుంది. నిర్వాహకులకు కావలసిన అగ్రెసివ్ నెస్, తప్పులు ఎత్తి చూపుతూ గొడవలు పడటం చేస్తుంది. ప్రేక్షకులకు కావలిసిన కంటెంట్ ఇస్తున్న ఇనయాను ఇంటి నుండి బయటికి పంపే రిస్క్ నిర్వాహకులు తీసుకుంటారా అనే సందేహం కలుగుతుంది. అయితే ఆమె కంటెస్టెంట్ శ్రీహాన్ ని వాడు అని సంబోధించి కాంట్రవర్సీకి కారణమయ్యారు. ఒకవేళ బిగ్ బాస్ ఇనయాను సేవ్ చేస్తే నేహా చౌదరి బట్టలు సర్దుకోవాల్సి వస్తుంది.

ఇనయా కాని పక్షంలో ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది నేహా చౌదరి అంటున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో నేహా తప్పుడు ఆరోపణ చేసి దొరికిపోయింది. ఇనయ తనను కొట్టకున్నా.. లాగి చెంపపై కొట్టిందని చెప్పింది. శనివారం నాగార్జున అది నిజం కాదని వీడియో ప్రూఫ్ తో తేల్చేశారు. దెబ్బ తగలకపోయినా నేహా చౌదరి నటించినట్లు క్లియర్ గా అర్థమైంది. కేవలం ముఖంపై చేయి తాకిన దానికి గట్టిగా కొన్నట్లు ఆరోపించి ద్రోషి అయ్యింది. ఇదంతా గమనిస్తుంటే ఇనయా బదులు నేహాను హౌస్ నుండి బయటికి పంపే ఛాన్స్ కలదు. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్సు కి తెరపడనుంది.