https://oktelugu.com/

Bigg Boss 5 Telugu : నెక్స్ట్ ఎలిమేనేటర్ ఆమెనే?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్-5 సీజ‌న్‌ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ సారి కంటిస్టెంట్స్ గేమ్ క‌న్నా.. ఆడియ‌న్స్ తీర్పు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌తో అనుభ‌వం సంపాదించిన ప్రేక్ష‌కులు.. ఎవ‌రిని ఉంచాలి? ఎవ‌రిని పంపించాలి? అనే విష‌యంలో ప‌క్కా కాలిక్యులేటెడ్ గా లెక్కలు వేసుకొని మ‌రీ.. ఓట్లు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తొలి వారం స‌ర‌యు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అడల్ట్ డైలాగుల‌తో యూట్యూబ్ స్టార్ గా క్రేజ్ అందుకున్న స‌ర‌యు.. బిగ్ బాస్ […]

Written By:
  • Rocky
  • , Updated On : September 14, 2021 / 11:32 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu : బిగ్ బాస్-5 సీజ‌న్‌ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ సారి కంటిస్టెంట్స్ గేమ్ క‌న్నా.. ఆడియ‌న్స్ తీర్పు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌తో అనుభ‌వం సంపాదించిన ప్రేక్ష‌కులు.. ఎవ‌రిని ఉంచాలి? ఎవ‌రిని పంపించాలి? అనే విష‌యంలో ప‌క్కా కాలిక్యులేటెడ్ గా లెక్కలు వేసుకొని మ‌రీ.. ఓట్లు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తొలి వారం స‌ర‌యు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అడల్ట్ డైలాగుల‌తో యూట్యూబ్ స్టార్ గా క్రేజ్ అందుకున్న స‌ర‌యు.. బిగ్ బాస్ హౌజ్ లోనూ అదే పంథా కొన‌సాగించ‌డం జ‌నాల‌కు న‌చ్చ‌లేదు.

    మ‌రో కంటిస్టెంట్ లోబోతో కలిసి ఆమె సిగరెట్ కాల్చడం సరయుకు భారీగా మైనస్ అయ్యిందని అంటున్నారు. సరయు ఇంత హాట్ అని సిగరెట్ కూడా మగాళ్లలాగా కాలుస్తుందని చాలామందికి తెలియదు. టీవీ చూస్తున్న మహిళలు, యువత కూడా సరయు (Sarayu) సిగరెట్ తాగడాన్ని జీర్ణించుకోలేదు. అందుకే ఆమెకు ఎక్కువగా ఓట్లు పడలేదని అంటున్నారు. ఆమె.. దూకుడు, బూతులు, తిట్ల వర్షం, సిగరెట్ తాగడంతో.. ఆమెను బ‌య‌ట‌కు పంపించేయాల‌ని ప్రేక్ష‌కులు డిసైడ్ అయ్యారు. పంపించేశారు.

    ఇప్పుడు వ‌చ్చే వారంలో ఎలిమినేట్ అయ్యే కంటిస్టెంట్ గురించిన చ‌ర్చ మొద‌లైంది. నామినేష‌న్ల‌లో కాజ‌ల్‌, న‌ట‌రాజ్, లోబో, యాని, ప్రియాంక‌, ప్రియ, ఉమ‌ ఉన్నారు. వీరిలో బ‌య‌ట‌కు వెళ్లేది ఎవ‌రు అన్న‌ప్పుడు.. అంద‌రి వేళ్లూ ఉమ (Uma) వైపే చూపిస్తున్నాయి. దీనికి ఆమె ప్ర‌వ‌ర్త‌నే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఆమె సీనియ‌ర్ న‌టి. పెద్ద‌గా ప్రాముఖ్యం ఉన్న పాత్ర‌లు చేయ‌న‌ప్ప‌టికీ.. చాలా కాలంగా ఇండ‌స్ట్రీలో ఉంది. అయితే.. బిగ్ బాస్ లో హౌస్ లో త‌న సీనియారిటీని చాటుకునేందుకు చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

    ఆమె మాట‌తీరు త‌న ఆధిప‌త్యాన్ని చాటుకునేలా ఉంద‌ని అంటున్నారు. గ‌ర్వం ఎక్కువ‌గా ఉంద‌ని, నాన్ వెజ్ స‌మ‌యంలో చేసిన ర‌చ్చ కార‌ణంగా.. ప్రేక్ష‌కుల్లో ఆమెకు మైన‌స్ మార్కులు పడే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అంతేకాకుండా.. నామినేష‌న్ల స‌మ‌యంలో అస‌భ్య‌క‌ర‌మైన మాట‌లు మాట్లాడ‌డం కూడా ఆమెపై వ్య‌తిరేక‌త పెంచింద‌ని చెబుతున్నారు.

    ఈ త‌ర‌హా గేమ్ ను ప్రేక్ష‌కులు అంగీక‌రించ‌ట్లేదు. గ‌తంలో సీనియ‌ర్ న‌టి హేమ‌, క‌రాటే క‌ల్యాణి కూడా ఇదేవిధంగా వ్య‌వ‌హ‌రించారు. తోటి స‌భ్యుల‌ను చుల‌క‌న చేసి మాట్లాడ‌డం.. తాము సీనియ‌ర్ అనే అహంభావం ప్ర‌ద‌ర్శించ‌డం కార‌ణంగా.. వారు వెంట‌నే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఉమ విష‌యంలోనూ ఇదే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.