https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: మన్మధరాజాలకే బిగ్ బాస్ టైటిలా? ఇదేం లాజిక్ రా బాబు!

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హౌస్ నుండి యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ లో ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు పొందిన రవి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అయితే రవి ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిరి, ప్రియాంక వంటి కంటెస్టెంట్స్ ని సేవ్ చేయడానికి రవిని బలి చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో స్నేహం […]

Written By:
  • Shiva
  • , Updated On : November 29, 2021 / 11:05 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హౌస్ నుండి యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ లో ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు పొందిన రవి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అయితే రవి ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిరి, ప్రియాంక వంటి కంటెస్టెంట్స్ ని సేవ్ చేయడానికి రవిని బలి చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో స్నేహం పేరుతో ఎఫైర్స్ పెట్టుకొని మిడ్ నైట్ మసాలా పంచుతున్న వారిని, కావాలనే ఎలిమినేట్ చేయడం లేదని అంటున్నారు.

    Anchor Ravi

    బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ పై ఎప్పటి నుండో అనుమానాలు ఉన్నాయి. ప్రేక్షకులు వేసే ఓట్ల విషయంలో పారదర్శకత లేదు. నిజంగా ఎవరికి అధికంగా ఓట్లు వచ్చాయనే విషయం మనకి తెలియదు. నిర్వాహకులు చెప్పేది గుడ్డిగా నమ్మాల్సిందే. ఈ క్రమంలో ఓట్ల ఆధారంగా కాకుండా.. నిర్వాహకులు తమ నిర్ణయం మేరకు ఎలిమినేట్ చేస్తున్నారనే వాదన ఉంది. గత సీజన్లో ఈ పుకార్లు బాగా వినిపించాయి. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.

    బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ కోసం హౌస్ లో చాలా మందిని బలి చేశారన్న వాదన వినిపించింది. అఖిల్ తో ఎఫైర్ పెట్టుకొని రొమాన్స్, గ్లామర్ తో రచ్చ చేస్తున్న మోనాల్ డ్రెస్ స్టైలిష్ తో పాటు బిహేవియర్ పై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.అయినప్పటికీ కేవలం ఫైనల్ కి ముందు వారం మోనాల్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అఖిల్ తో మోనాల్ పెట్టుకున్న ఎఫైర్ కారణంగానే ఆమెను చివరి వరకు ఉంచారన్న ఆరోపణలు వినిపించాయి.

    Also Read: యాంకర్ రవి ఎలిమినేషన్ అన్యాయమంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఫ్యాన్స్ ఆందోళన

    తాజాగా రవి ఎలిమినేషన్ లో కూడా ఇలాంటి కోణం ఉందని కొందరి భావన. ప్రియాంక, సిరి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవనున్నారని మొదట సమాచారం అందింది. తర్వాత అనూహ్యంగా రవి పేరు తెరపైకి వచ్చింది. మానస్ తో రొమాన్స్ చేస్తున్న కారణంగా ప్రియాంక… షణ్ముఖ్ తో సన్నిహితంగా ఉంటున్న కారణంగా సిరిని ఎలిమినేషన్ నుండి తప్పించి, రవిని ఎలిమినేట్ చేశారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    రవి టైటిల్ విన్నర్ కాకపోవచ్చు… అయితే సిరి, ప్రియాంక, కాజల్ కంటే అతనికి తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మడం కష్టమే. ఇక గత రెండు సీజన్స్ విన్నర్స్ ని పరిశీలిస్తే అభిజీత్, రాహుల్ సిప్లిగంజ్ హౌస్ లో ఎఫైర్స్ నడిపారు.సీజన్ 3 విన్నర్ రాహుల్ హీరోయిన్ పునర్నవితో, అభిజీత్ యూట్యూబర్ హారికతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.

    Also Read: బిగ్ బాస్ ఆదరణ..యాంకర్ రవికి షాక్.. అతడికే ఎక్కువ మద్దతు

    Tags