బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభమైన రెండో రోజు నుంచే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే కలిసి కట్టుగా ఉన్న సభ్యులు…..ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారు. చిన్న చిన్న సమస్యలు, కారణాలతో గొడవలు మొదలయ్యినా… అవి తారాస్థాయికి చేరుతున్నాయి. యాథావిధిగా బిగ్‌బాస్ చిచ్చు పెట్టకముందే ఇంటి సభ్యులే మనస్పర్థలు పెంచుకుంటూ.. నానా రచ్చ చేస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు.

ఇక బిగ్ బాస్ ప్రారంభమై… నాలుగు వారాలు కావస్తోంది. అయితే ఈసారి ఎన్నడూ లేనివిధంగా.. ఒకేసారి 19 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై సందేహాలు కలిగించాడు బిగ్ బాస్. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
ఎవరూ ఊహించని పరిణామాల మధ్య లహరి మూడో వారంలో ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ త్వరలో ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడని, అందుకే లహరిని ఎలిమినేట్ చేసి ఆ స్థానాన్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌తో భర్తీ చేసే ప్లాన్‌లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంత వరకు నిజమనేది రానున్న రోజుల్లో తెలియనుంది. వరుసగా మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే నాలుగో వారం మాత్రం కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ ను వీడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో సిరి, కాజల్, లోబో, సన్నీ, అని మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియ, రవి ఉన్నారు. మొత్తానికి అత్యధికంగా 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు.
ఈ సీజన్లో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా జనాల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిని తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందులో భాగంగా.. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బుల్లితెరపై టాప్ యాంకర్స్‌లలో ఒకరైన వర్షిణి రాబోతున్నట్లు టాక్. అటు పలు షోలలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంది వర్షిణి. భారీ ఫాలోయింగ్ ఉన్న వర్షిణి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే.. అసలైన రచ్చ అప్పుడే అంటున్నారు నెటిజన్స్.