Bigg Boss 5 Telugu: వీకెండ్ లో మారిన బిగ్ బాస్ పోలింగ్.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అంటే?

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై సందడి చేస్తున్న ‘బిగ్ బాస్ ’(Bigg Boss) షో వీకెండ్ కు వచ్చేసింది. గత ఆదివారం బిగ్ బాస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన కింగ్ నాగార్జున ఏకంగా 19మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాడు. ఇప్పుడు హౌస్ నిండుగా ఉండి గొడవలు, కొట్లాటలతో దద్దరిల్లిపోతోంది. మరే షోకు దక్కనంత స్పందన తెలుగు బిగ్ బాస్ కు వస్తోంది. గత సోమవారం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ […]

Written By: NARESH, Updated On : September 11, 2021 3:35 pm
Follow us on

Bigg Boss 5 Telugu: బుల్లితెరపై సందడి చేస్తున్న ‘బిగ్ బాస్ ’(Bigg Boss) షో వీకెండ్ కు వచ్చేసింది. గత ఆదివారం బిగ్ బాస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన కింగ్ నాగార్జున ఏకంగా 19మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాడు. ఇప్పుడు హౌస్ నిండుగా ఉండి గొడవలు, కొట్లాటలతో దద్దరిల్లిపోతోంది. మరే షోకు దక్కనంత స్పందన తెలుగు బిగ్ బాస్ కు వస్తోంది. గత సోమవారం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ కాగా.. ఓటింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ క్రమంలోనే ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్(Elimination) అవ్వబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ షో మొత్తంలో ఎంతో కీలకమైన నామినేషన్ కు రంగం సిద్ధమైంది. ఈ శని, ఆదివారాల్లో నామినేట్ అయిన ఇంటి సభ్యుల నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ప్రస్తుతం గత సోమవారం నామినేట్ అయిన వారిలో ‘యాంకర్ రవి, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయు’లు ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

గత సోమవారం నామినేషన్ల త్వారత ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆరంభంలో యాంకర్ రవికి ఎక్కువ ఓట్లు పడగా.. ఆ తర్వాత చాలా మంది టార్గెట్ చేసిన కారణంగా సింపతి వచ్చి జస్వంత్ పడాలకు కూడా భారీగా ఓట్లు పోలయ్యాయని తెలిసింది. అతడి తర్వాత మానస్ కు బాగానే ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఈ వారాంతంకు వచ్చేసరికి లేడి కంటెస్టెంట్లు ముగ్గురికి కొంచెం తక్కువగా ఓట్లు పోలయ్యాయని టాక్ నడుస్తోంది.

ఈ వీకెండ్ కు వచ్చేసరికి యాంకర్ రవి ఓటింగ్ లో టాప్ ప్లేసులో కొనసాగుతున్నాడని తెలిసింది. ఆనీ మాస్టర్ తో గొడవ పెట్టుకున్న జస్వంత్ కు ఓటింగ్ మొదట్లో తగ్గిపోగా.. చివరి రెండు రోజుల్లో అతడి పరిస్థితి మాత్రమే కాదు.. మిగిలిన వాళ్ల ఓటింగ్ సరళిలో కూడా భారీగా మార్పులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తి నెలకొంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం ఓటింగ్ లో యాంకర్ రవి అందరికంటే అత్యధిక ఓట్లతో టాప్ లో నిలిచాడట.. అతడి తర్వాత మానస్ ఉన్నాడని అంటున్నారు. వీళ్లిద్దరి తర్వాత జస్వంత్ కే ఎక్కువ ఓట్లు పోలాయ్యాయని సమాచారం. ముగ్గురు మగాళ్లు సేఫ్ కాగా.. ముగ్గురు అమ్మాయిలు ఆర్జే కాజల్, హమీదా, సరయులు డేంజర్ జోన్ లో ఉన్నారని టాక్.

ఈ వారం అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన వారిలో హమీదా, సరయు ఉన్నట్టు టాక్. ఈ వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమని అంటున్నారు. అయితే బిగ్ బాస్ అంటే ఊహించని షాకులుంటాయి. అనుకోని పరిణామాలు ఉంటాయి. చివర్లో ఏమైనా జరగొచ్చు. అందుకే ఎవరు ఎలిమినేట్ అన్నది శని,ఆదివారాల్లో ప్రసారమయ్యే షోతోనే తేలనుంది.