Bigg Boss 5 Telugu: తెలుగు సినీ పరిశ్రమలో మన్మథుడిగా పేరు తెచ్చుకొని… అందం, అభినయాన్ని వారసత్వంగా పునికితెచ్చుకున్న నటుడు అక్కినేని నాగార్జున. నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈయన.. గత 2 సీజన్‌ల నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తూ… బెస్ట్ యాంకర్‌గానూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కరోనాతో విసిగిపోయిన ప్రజల్లో ఈసారి మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ముందుకొచ్చింది స్టార్ మా.
అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్5లో నాగార్జున ఈసారి మరింత ఉత్సాహంగా కనిపించారు. విభిన్న డాన్సులతో, వినూత్న రీతిలో వచ్చిన 19మంది కంటెస్టంట్స్‌ను నాగార్జున తనదైన స్టైల్‌లో ఆహ్వానించారు. వారి పరిచయాలు, టార్గెట్‌ల గురించి సరదాగా ముచ్చటించిన ఆయన వారందరినీ హౌస్‌లోకి పంపించారు.
కొంతమంది పేరు తెచ్చుకోవడాని, తామేంటో అందరికీ చూపించాలని హౌస్‌లోకి వెళితే.. మరికొందరు తమ లక్ష్యం నేరవేరేందుకు దీన్ని మంచి అవకాశంగా మలుచుకుంటారు. కొంతమందికి మంచి క్రేజ్‌ను తీసుకొస్తే.. మరికొంతమంది లోటుపాట్లు బయటపడ్డాయి. ఏదేమైనా బిగ్‌బాస్ అంటేనే ఫేమస్ అవుతారనే భావన చాలా మందిలో ఏర్పడింది.
ఇదిలా ఉండగా విభిన్న మనస్తత్వాలు.. విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వీరందరి మధ్య ఆట ఎలా ముందుకు సాగుతుందన్నది మాత్రం అందరికీ ఆసక్తిగానే ఉంది. ఇకపోతే ఇంట్లోకి ఎంటరైన తర్వాతి రోజు నుంచే ఆట మొదలైందని చెప్పవచ్చు. అందులో భాగంగానే… కొందరు హౌస్‌మేట్స్ గ్రూపులుగా విడిపోయి తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు తహతహలాడారు.
ఇదిలా ఉండగా లాస్ట్ సీజన్‌లో స్మోకింగ్‌ను ఇంటి సభ్యులు సరిగా వినియోగించుకోలేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం లోబో, యూట్యూబ్ స్టార్ సరయు, హమీదాలు ఈ రూమ్‌ను అప్పుడే వాడుకోవడం మొదలెట్టారు.ఈ క్రమంలోనే వీరందరూ స్మోకింగ్ రూమ్ లో దమ్ము కొడుతూ రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా వీరందరూ స్మోక్ చేయడంతో వీరి మధ్య స్నేహం మరింత బలపడనుందా.. లేదా గొడవల పర్వం చవిచూస్తుందా వేచి చూడాల్సిందే మరి… ఏది ఎలా ఉన్నా.. బిగ్‌బాస్ సీజన్5లో ఎవరు ఎలా తమ గేమ్ ప్లే చేస్తారన్న ఆసక్తి మాత్రం ప్రతీ ఒక్క వీక్షకుడిలోనూ ఉంది.