Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో సందడి చేసే బిగ్ బాస్ కార్యక్రమంలో నిత్యం కొట్లాటలు, గొడవలు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా కొట్లాటలు గొడవల కారణంగా వారి వ్యక్తిత్వం ఆధారంగా ప్రేక్షకులు వారికి ఓటు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్స్ సింపతి కోసం ఎమోషనల్ అవుతూ ఉండగా మరి కొందరు కావలసిగానే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమై రెండు రోజులు అయినప్పటికీ పెద్దఎత్తున కంటెస్టెంట్ ల మధ్య కొట్లాటలు మొదలయ్యాయని చెప్పవచ్చు.
ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కొట్లాటలు మొదలయ్యాయి. తాజాగా హమీదా, జెస్సీ గొడవ మర్చిపోకముందే లోబో, సిరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు మంగళవారం సాయంత్రం స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తోంది. ఈ ప్రోమోలో భాగంగా లోబో తనకు జరిగిన గొడవ గురించి ఇతర కంటెస్టెంట్ లతో మాట్లాడుతున్న సమయంలో లోబో అక్కడికి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలని చెప్పగా అందుకు సిరి లోబోను చులకనగా మాట్లాడటంతో నా దగ్గర సరిగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇస్తాడు.
నన్ను గెలికితే నేను ఈ విధంగానే మాట్లాడతాను అంటూ సిరి గట్టిగా అరుస్తుంది. సిరి ఈ విధంగా తనకు కౌంటర్ ఇవ్వడంతో మండిపడిన లోబో మొహం అద్దంలో చూసుకో అంటూ కౌంటర్ వేసాడు. ఒక్కసారిగా సిరిని అలా అనడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరి నా మొహం గురించి మాట్లాడావంటే మొహం పగిలిపోద్ది అంటూ లోబో పై ఫైర్ అయ్యింది. ఇలా వీరిద్దరి మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.