Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఎట్టకేలకు ఆరో వారానికి చేరుకుంది. పజిల్ లాంటి ఈ గేమ్ లో ఎవరు ఎన్ని రోజులు ఉంటారో, ఎప్పుడు వెళ్ళిపోతారో చెప్పడం కష్టం.. అందుకే ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్టులు, భారీ మార్పులు సంభవిస్తాయి. అలా అనుకోని పరిస్థితుల మధ్య ఐదో వారానికి గాను హమీదా ఎలిమినేట్ అయ్యింది. ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం లో హమీదా దిట్ట. సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాల్ని మొహం మీద చెప్తూ బిగ్ బాస్ హౌస్ లో తన ఉనికిని చాటుకుంది.

ఈ నేపథ్యంలో లవ్ ట్రాక్ కి బలైన హమీదా ఐదో వారానికే తట్ట బుట్ట సర్దుకుని బిగ్ బాస్ ఇంటి నుండి తన ఇంటికి వచ్చేసింది. సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్క సీజన్ లో లవ్ ట్రాక్ లు నడిపించడం బిగ్ బాస్ ఆనవాయితి . మొదటి సీజన్ లో హరితేజ – శివ బాలాజీ, దీక్ష పంత్ – ప్రిన్స్, రెండవ సీజన్ లో తనీష్ – దీప్తి సునయన, సామ్రాట్ రెడ్డి – తేజస్వి, మూడో సీజన్ కి గాను రాహుల్ సింప్లిగంజ్ – పునర్నవి భూపాళం, నాలుగో సీజన్ కి గాను అభిజీత్ – హారిక, అఖిల్ – మోనాల్….. ఇలా బోలెడన్ని లవ్ ట్రాక్ లు నడిపిన బిగ్ బాస్… సీజన్ 5 లో కూడా అంతే రకమైన మసాలా పట్టించి 5 మచ్ రొమాన్స్ కి తెర లేపాడు.
ఇదిలా ఉండగా…. ఇండియన్ ఐడల్ విన్నర్ సింగర్ శ్రీరామ చంద్ర అందరికి సుపరిచితమే. ఎందరో అభిమానుల ప్రేమను మూటకట్టుకున్న శ్రీరామ చంద్ర కి ఫ్యాన్స్ లేకపోనేలేదు. హౌస్‌లో ఎక్కువగా శ్రీరామచంద్రతోనే ఉండటం, మిగతావాళ్లను లెక్కచేయకపోడంతో ఆమెపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ప్రతి చిన్న విషయానికి శ్రీరామ్ మీదే ఆధారపడుతోందన్న విమర్శలు కూడా వచ్చాయి. అందుకే తొందరగా తట్టా – బుట్టా సర్దుకుని బిగ్ బాస్ హౌస్ ని వీడి వెళ్ళిపోయింది.
వరుసగా లేడీ కంటెస్టెంట్లు వెళ్లిపోవడం వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయాయి. మరి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ని పంపిస్తాడా..? పంపిస్తే ఎప్పుడు పంపుతాడు అనే విషయం మీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎదుకంటే ఇప్పటికే బిగ్ బాస్ ఆరో వారానికి చేరుకుంది. ఒకవేళ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటే ఈ వారం మొదట్లో కానీ, చివర్లో కానీ ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలంటే బిగ్ బాస్ మీద ఒక కన్ను వేసి ఉండాల్సిందే.