Jaswanth padala Remuneration: ప్రతి వారం వారం ఏదో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం మీద ఎప్పుడు ఆసక్తి ఉంటుంది ప్రేక్షకుల్లో. అలా పదో వారానికి గాను మోడల్ జస్వంత్ పడాల ఎలిమినేట్ అయిన సంగతి తెల్సిందే.. మొత్తానికి విజయవంతం గా 70 రోజులు పూర్తి చేసుకుని ఎలిమినేట్ అయ్యాడు. అయితే మరి ఇన్ని వారాలకు గాను జెస్సీ ఎంత పారితోషకం అంది పుచ్చుకున్నాడో అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
మంచి నటి నటులు గా ఎదగాలి… మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఉంటుంది. గుర్తింపు తెచ్చుకోవడానికి ఇప్పుడున్న వాటిలో ఒకటి బిగ్ బాస్. చాలామంది సెలెబ్రిటీలకి బిగ్ బాస్ కి వెళ్లడం అనేది ఒక కల. కానీ అందరికీ ఆ అవకాశం రావడం చాలా అరుదు. కొందరికే బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం దక్కుతుంది. ప్రేక్షకులని మరింత దగ్గర చేసే ఈ షో కోసం వేరే ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి మరి బిగ్ బాస్ షో లో పాల్గొంటారు. ఇటు వైపు సెలబ్రిటీస్ ఎంతో ఉత్సాహం తో అయితే బిగ్ బాస్ కి రావాలని అనుకుంటున్నారో బిగ్ బాస్ కూడా వాడల్లా ఆశల్ని అడియాసలు చేయకుండా అంతే విధంగా వాళ్ళకి పారితోషికం ముట్ట చెప్పి వాళ్ళని సంతృప్తి పరుస్తుంటాడు.
అయితే ఈ పారితోషకం అన్నది సెలబ్రిటీ యొక్క పాపులారిటీ ని బట్టి నిర్ణయించబడి ఉంటది. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అలా మోడల్ జెస్సీ వారానికి గాను 1,75,000 నుండి 2,00,000 లక్షల వరకు సంపాదించాడని వినికిడి. అలా పది వారాలకి గాను 20,00,000 లక్షల రూపాయలు సంపాదించాడని ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది.