Bigg Boss 10: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ నెలలో మొదలు కాబోతుంది. ఈ రియాలిటీ షో కోసం ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రియాలిటీ షో ని కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు , యూత్ ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన గొడవలు, ప్రేమలు , కోపాలు అన్నీ కూడా ఈ రియాలిటీ షోలో ఉంటాయి. గత సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బంధాలు , అనుబంధాలతో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా సాగిపోవడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ 9 వ సీజన్ కి బ్రహ్మరథం పట్టారు. సీజన్ 9 అంత పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 10 పై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకుంది.
అందుకే మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా , ఈ సీజన్ ని చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యులకు ఎంట్రీ ఇప్పిస్తున్నారు. అదే విధంగా సెలబ్రిటీలను కూడా ఈసారి టాప్ మోస్ట్ గా ఉండేలా చూస్తున్నారు. ఇద్దరు సెలబ్రిటీలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తీసుకొని రావాలని చూస్తున్నారట మేకర్స్. ఆ ఇద్దరు మరెవరో కాదు , ఒకరు అమర్ దీప్ సతీమణి తేజస్విని , మరొకరి కావ్య శ్రీ. వీళ్లిద్దరికీ కూడా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. అయితే వీళ్ళని బిగ్ బాస్ షో కి తీసుకొని రావాలంటే వారానికి 6 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వాలి. తేజస్విని గత సీజన్ లోనే రావాల్సి ఉంది, కానీ అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేక ఆమెని తీసుకోలేకపోయారు మేకర్స్.
అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ఆమెని తీసుకొని రావాలని చూస్తున్నారు. ప్రస్తుతం తమిళం లో ఆమె ‘ఆయాలి’ అనే సూపర్ హిట్ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది . ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆ సీరియల్ ని వదిలి రావాలి. అందుకే ఆమె వారానికి 6 లక్షల రూపాయిలు డిమాండ్ చేస్తోంది. మేకర్స్ కూడా అందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానల్ లో ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ షోలో కుక్ గా వ్యవహరిస్తోంది. ఇక కావ్య కూడా వారానికి 5 లక్షల రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం , మేకర్స్ అందుకు ఒప్పుకున్నారట. వీళ్ళిద్దరూ కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ కాబట్టి , వీళ్ళు 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతారు. దీంతో కేవలం వీళ్లిద్దరి బడ్జెట్ నే కోటి 60 లక్షలు దాటేస్తోంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ కలిపితే ఏ రేంజ్ బడ్జెట్ అవ్వుద్దో మీరే ఊహించండి.