https://oktelugu.com/

F3 Movie: ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?

F3 Movie: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ఈ సినిమా టీమ్ అప్పుడే మ్యూజికల్ ప్రమోషన్‌ ను స్టార్ట్ చేసింది. ఐతే, రేపు ఉద‌యం 10.08 నిమిషాల‌కు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రేపు టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. పోస్టర్‌ లో హీరోయిన్స్ ఒక […]

Written By:
  • Shiva
  • , Updated On : May 2, 2022 / 09:32 AM IST
    Follow us on

    F3 Movie: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ఈ సినిమా టీమ్ అప్పుడే మ్యూజికల్ ప్రమోషన్‌ ను స్టార్ట్ చేసింది. ఐతే, రేపు ఉద‌యం 10.08 నిమిషాల‌కు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో రేపు టీజర్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. పోస్టర్‌ లో హీరోయిన్స్ ఒక పక్క తాడు లాగుతూ ఉంటే.. మరోపక్క వరుణ్ తేజ్ పోటీగా తాడు లాగుతూ కనిపించాడు.

    F3 Movie

    వెంకీ మాత్రం ఎప్పటిలాగే చిన్నపాటి స్టిల్ ఇచ్చాడు. అయితే, పోస్టర్ లో తమన్నా మాత్రం చాలా గ్లామర్‌గా కనిపించడానికి చాలా కష్టపడింది. ఏది ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది.

    Also Read: Sreemukhi: సర్వం ధారపోసిన శ్రీముఖి.. మత్తెక్కినట్టు మెంటలెక్కిపోతున్న ఫ్యాన్స్ !

    అదే విధంగా ఎఫ్ 2లోని వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది. ఎలాగూ ఈ సీక్వెల్ లోనూ త‌మ‌న్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టుకెళుతున్న వెంకటేష్, వరుణ్ లను చూపించి.. అనిల్ రావిపూడి కథను చెప్పేశాడు.

    F3 Movie

    ఇక ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. త‌మ‌న్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.

    Also Read:Actor’s Wife Hot Comments: శృంగారంపై ప్రముఖ నటుడి భార్య హాట్ కామెంట్లు

    Recommended Videos


    Tags