https://oktelugu.com/

Kalki 2829 AD : కల్కి 2829 AD టైటిల్ వెనుక లాజిక్ ఇదా? కథ మొత్తం చెప్పేసిన డైరెక్టర్!

2024లో కల్కి విడుదల కానుంది. కల్కికి సీక్వెల్ కూడా ఉంటుందట. పార్ట్ 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2023 / 09:29 PM IST

    Kalki 2829 AD

    Follow us on

    Kalki 2829 AD : ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది కల్కి 2829 AD . ఈ సినిమా ప్రకటన నాటి నుండి అనేక అనుమానాలు ఉన్నాయి. చిత్ర కథపై ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. గతంలో నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ… లార్డ్ విష్ణు ప్రస్తావన ఈ చిత్రంలో ఉంటుంది. లోతైన ఎమోషన్స్ కూడా చెప్పామని అన్నారు. తాజాగా కల్కి చిత్ర కథ, టైటిల్ గురించి కొన్ని కీలక విషయాలు దర్శకుడు నాగ అశ్విన్ వెల్లడించాడు. ఆయన మాటలు వింటుంటే.. అంచనాలు పీక్స్ కి చేరాయి.

    ప్రచారమైనట్లే ఇది టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ అని నాగ అశ్విన్ ఓపెన్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పాము. హాలీవుడ్ సినిమాల మాదిరి భవిష్యత్ ని ఆవిష్కరించాము. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పాము. ఈ సినిమా కోసం వాడిన ఆయుధాలు, టెక్నాలజీ కొత్తగా ఉంటాయి. అదే సమయంలో భారతీయ మూలాల స్ఫూర్తితో రూపొందించాము. భారతీయతను ప్రతిబింబిస్తాయి.

    కాన్సెప్ట్ డిజైనర్స్, ఆర్ట్ డిజైనర్స్ బాగా ఆలోచించి వాటిని రూపొందించామని అన్నారు. ఒక కొత్త ప్రపంచం సృష్టించాము. అక్కడ ఈ కథ జరుగుతుందని నాగ అశ్విన్ అన్నారు. ఇక కల్కి 2829 AD అనే టైటిల్ పెట్టడం వెనకున్న కారణం కూడా నాగ అశ్విన్ తెలియజేశారు. ఈ టైటిల్ పెట్టడానికి ఒక లాజిక్ ఉంది. అది మూవీ విడుదల దగ్గర పడ్డాక ప్రొమోషన్స్ టైం లో రివీల్ చేస్తాను అన్నాడు. ఆ లాజిక్ ఏమిటో రివీల్ చేయలేదు.

    కల్కి భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుంది. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. కమల్ హాసన్ వంటి స్టార్ హీరో జాయిన్ అయ్యాడు. ఆయన విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక అమితాబ్ మరో కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

    2024లో కల్కి విడుదల కానుంది. కల్కికి సీక్వెల్ కూడా ఉంటుందట. పార్ట్ 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి బడ్జెట్ రూ. 500 కోట్లకు పై మాటే. కెరీర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు.