Prabhas – Salaar : ప్రభాస్ ని ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆయన చిత్రాలు చెప్పిన తేదీకి వచ్చిన దాఖలాలు లేవు. బాహుబలి నుండి ఆదిపురుష్ వరకు ప్రభాస్ ప్రతి సినిమా విడుదల వాయిదా పడింది. సాహో 2019 సమ్మర్ కి ప్రకటించి ఆగస్టులో విడుదల చేశారు. 2022 సంక్రాంతికి అనుకున్న రాధే శ్యామ్ సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఆదిపురుష్ 2022 చివర్లో అని ప్రకటించారు. తర్వాత 2023 సంక్రాంతి అన్నారు. ఫైనల్ గా జూన్ నెలలో విడుదల చేశారు.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ ని కూడా ఈ సెంటిమెంట్ వదల్లేదు. సెప్టెంబర్ 28న విడుదల చేయాలని యూనిట్ భావించారు. వరుస సెలవులతో కూడిన ఈ గోల్డెన్ డేట్ ని సలార్ మిస్ చేసుకుంది. సలార్ రిలీజ్ డేట్ కోసం ఇతర చిత్రాల నిర్మాతలు వేచి చూడాల్సి వచ్చింది. ఇండియా వైడ్ ఒక కన్ఫ్యూషన్ నెలకొంది. ఎట్టకేలకు డిసెంబర్ 22 అన్నారు.
అంటే విడుదలకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా ప్రమోషన్స్ చేయడం లేదు. ఈ క్రమంలో సలార్ మరోసారి వాయిదా పడే ఆస్కారం కలదన్న వాదన వినిపిస్తోంది. దీపావళికి సలార్ నుండి అప్డేట్ రానిపక్షంలో సలార్ డిసెంబర్ కి రానట్లే అని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే ఇటీవల ప్రభాస్ లేకుండా ఇతర నటుల మీద 10 రోజుల షూటింగ్ చేశారట. ఈ పరిణామాలు గమనిస్తుంటే సలార్ విడుదల అనుమానమే అంటున్నారు..
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పర్ఫెక్ట్ గా వస్తేనే విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ సంతృప్తికరంగా ఉండాలట. డిసెంబర్ కి సలార్ రాకపోతే 2024 మార్చ్ లో విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. సలార్ మరోసారి వాయిదాపడితే ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు. కాగా సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందట. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు.