NBK 107: బాలయ్య ఫ్యాన్స్ కి నేడు బిగ్ డే. కర్నూలు వేదికగా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ అండ్ లోగో విడుదల చేయనున్నారు. నేడు సాయంత్రం 8:15 నిమిషాలకు టైటిల్ లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కి పెద్ద ఎత్తున బాలయ్య ఫ్యాన్స్ హాజరుకానున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో NBK 107 టైటిల్ పై భారీ ఆసక్తి నెలకొని ఉంది. అయితే బాలయ్య టీమ్ కి బిగ్ షాక్ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అధికారిక విడుదలకు ముందే NBK 107 చిత్ర చిత్ర టైటిల్ లీకైంది.

జరుగుతున్న ప్రచారం ప్రకారం ‘అన్నగారు’ టైటిల్ నిర్ణయించారట. బాలయ్య ఇమేజ్ కి ఈ టైటిల్ బాగా సెట్ అవుతుందని యూనిట్ భావిస్తున్నారట. అలాగే బాలయ్య తండ్రిగారైన ఎన్టీఆర్ ని అభిమానులు ఇలానే పిలుచుకునేవారు. ఆంధ్రాలో అన్నగారు అంటే ఎన్టీఆర్ అని అందరికీ తెలుసు. సెంటిమెంట్ పరంగా కూడా బాలకృష్ణకు కలిసొచ్చే టైటిల్ ఇది. గతంలో బాలకృష్ణ పెద్దన్నయ్య టైటిల్ తో మూవీ చేశారు. డ్యూయల్ రోల్ లో కనిపించిన ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
అన్నింటికీ మించి కథకు ఈ టైటిల్ చక్కగా సరిపోతుందట. ఏ విధంగా చూసిన ‘అన్నగారు’ టైటిల్ కరెక్ట్ అని భావిస్తున్న చిత్ర యూనిట్ ఫైనల్ చేశారట. సాయంత్రం కర్నూల్ వేదికగా ప్రకటించనున్న టైటిల్ ఇదే అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు .

క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఇక బాలయ్య నెక్స్ట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు అన్ స్టాపబుల్ షోతో సంచలనాలు చేస్తున్నారు. సీజన్ 2 ఇటీవల స్టార్ట్ కావడంతో పాటు భారీగా ఆదరణ దక్కించుకుంటుంది.