https://oktelugu.com/

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీకి రిలీజ్ ముందు బిగ్ షాక్

Bheemla Nayak: దేనికైనా ఓ లెక్క ఉండాలి. సమాయానికి పూర్తిచేయగల సామర్థం ఉండాలి. టైం టు టైం పనిచేస్తేనే సినిమా పూర్తి అవుతుంది. షూటింగ్ ల పేరిట కాలయాపన చేస్తే ఎన్ని ఏళ్లు అయినా చిత్రం పూర్తికాదు. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అనుకోని జాప్యం ఏర్పడింది. ఎందుకంటే కరోనా కల్లోలంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభైనా ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే అనివార్యంగా సినిమా ఫస్ట్ కాపీ తయారీ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2022 / 05:23 PM IST
    Follow us on

    Bheemla Nayak: దేనికైనా ఓ లెక్క ఉండాలి. సమాయానికి పూర్తిచేయగల సామర్థం ఉండాలి. టైం టు టైం పనిచేస్తేనే సినిమా పూర్తి అవుతుంది. షూటింగ్ ల పేరిట కాలయాపన చేస్తే ఎన్ని ఏళ్లు అయినా చిత్రం పూర్తికాదు. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అనుకోని జాప్యం ఏర్పడింది. ఎందుకంటే కరోనా కల్లోలంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభైనా ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే అనివార్యంగా సినిమా ఫస్ట్ కాపీ తయారీ జాప్యమైందట. తాజాగా ట్రైలర్ ను చూస్తేనే ఆదరబాదరాగా రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.

    Bheemla Nayak:

    ఫిబ్రవరి 25న రిలీజ్ కు రెడీ అయిన భీమ్లా నాయక్ మూవీ పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ వారికి షాకింగ్ న్యూస్ అందింది. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్పతో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్ తో రాంచరణ్, ఎన్టీఆర్ లు ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ లు అవుతున్నారు.

    Also Read:  ఆడ గాత్రమే శాపమై.. అవమానాల పాలై.. నేడు టాలెంట్ తో ఎదిగిన కుర్రాడి కథ

    ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు సైతం తాజాగా ‘భీమ్లానాయక్’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం వచ్చింది. ఎందుకంటే హిందీలో విడుదలకు సినిమాలు లేవు. ఇప్పుడు రిలీజ్ చేస్తే అంతో ఇంతో పవన్ కు పేరు, డబ్బులు వచ్చేవి. కానీ దాన్ని చేజేతులారా పాడు చేసుకున్నట్టు తెలిసింది. మలయాళ అయ్యప్పమ్ కోషియం మూవీ మాతృకలోని కొన్ని సన్నివేశాలను, కథను తెలుగులో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని కీలక మార్పులు చేసి తెరకెక్కించారట.. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇదే ఇప్పుడు పవన్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేయకుండా దూరం చేసిందట..

    Bheemla Nayak

    ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతోపాటు, హిందీలో కూడా ఏకకాలంలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తీరా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సంబంధించి పనులు పూర్తి కాలేదట.. అందుకే హిందీ టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయలేదు. భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ ను ఒక వారం ఆలస్యంగా అక్కడ థియేటర్స్ లో విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో పవన్ ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడన్న అభిమానుల ఆశకు ఇది గండిపడింది.

    ఎందుకంటే తెలుగులో రిలీజ్ అయితే దాన్ని కాపీ రాయుళ్లు డౌన్ లోడ్ చేసి హిందీ జనాలకు చూపిస్తారు. అది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ఒకేసారి హిందీ, తెలుగులో రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి భీమ్లానాయక్ ఆలస్యం పవన్ బాలీవుడ్ ఆశలకు కల్లెం వేసిందని అంటున్నారు.

    Also Read: అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లతో భీమ్లానాయక్ కు ఉన్న ప్లస్ లు, మైనస్ లేంటి?

    Tags