Sonu Sood: భారీ రోడ్డు ప్రమాదం.. హీరోలా వచ్చి కాపాడిన సోనూసూద్ !

Sonu Sood:  సినిమా సన్నివేశాల్లో ఎవరైనా ఆపదలో ఉంటే రీల్ హీరోలు వచ్చి కాపాడుతుంటారు. కానీ, నిజ జీవితంలోనూ అలాగే కాపాడి నెటిజన్ల చేత రియల్ హీరో అని అనిపించుకున్నారు సోనూసూద్. పంజాబ్ లోని మోగ వద్ద ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆయన తక్షణమే స్పందించి క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో సోనూకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా […]

Written By: Shiva, Updated On : February 9, 2022 4:48 pm
Follow us on

Sonu Sood:  సినిమా సన్నివేశాల్లో ఎవరైనా ఆపదలో ఉంటే రీల్ హీరోలు వచ్చి కాపాడుతుంటారు. కానీ, నిజ జీవితంలోనూ అలాగే కాపాడి నెటిజన్ల చేత రియల్ హీరో అని అనిపించుకున్నారు సోనూసూద్. పంజాబ్ లోని మోగ వద్ద ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆయన తక్షణమే స్పందించి క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో సోనూకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Sonu Sood

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా సోనూసూద్ చేసిన సేవల గురించి మాటల్లో చెప్పలేం. సోనూకి దేశవ్యాప్తంగా భారీ ప్రశంసలు వస్తున్నాయి. ఐతే, పైన రోడ్డు ప్రమాదంలో బాధితుడైన వ్యక్తిని పంజాబ్‌లోని ఆసుపత్రిలో చేర్చి.. అతనికి పూర్తి చికిత్స కూడా చేయించడం గొప్ప విషయం. ప్రస్తుతం ఈ వీడియో చూసిన అందరూ సోను చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read:  పెళ్లి చేసుకుంటున్నారా.. అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!

మొత్తానికి పంజాబ్‌లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 19 ఏళ్ల అబ్బాయి ప్రాణాలను సూద్ సంస్థ కాపాడింది. అసలు ఏమి జరిగింది అంటే.. సోనూసూద్ ప్రయాణిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు స్థితిని చూసిన సోనూసూద్, తన వాహనాన్ని వెంటనే ఆపి, ఆ బాలుడిని రక్షించాడు.

సూద్ సంస్థ ట్విట్టర్‌లో పంచుకున్న వీడియోలో, గాయపడిన బాలుడిని సూద్ తన చేతుల్లోకి తీసుకువెళ్తూ కనిపించడం అందర్నీ ఆకట్టకుంది. మొత్తానికి కఠినమైన పరిస్థితుల్లో సామాన్యుడికి అండగా నిలబడిన వ్యక్తి ‘సోనూసూద్’. అందుకే ప్రతి ఒక్కరు సోనూసూద్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆశిద్దాం. అయినా సమాజంలో మూకుమ్మడి సమస్య వస్తే ఎవరైనా ప్రభుత్వానికి చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు ప్రజలు తమ సమస్యకి పరిష్కారం చూపమని సోనూసూద్ ను అడుగుతున్నారు.

Also Read: ఊపిరి పీల్చుకోండి.. కరోనా వైరస్ పై కొత్త అస్త్రం.. తొలి నాసల్ స్ప్రే విడుదల

Tags