Big Heroes : ఒక్కప్పుడు ఎస్ వి కృష్ణారెడ్డి (S V Krishna Reddy) వరుసగా సినిమాలు చేస్తు సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉండడం అతనికి చాలా బాగా ప్లస్ అయింది. స్టార్ హీరోల నుంచి కూడా అతనికి భారీ అవకాశాలు వచ్చినప్పటికి వాటిని సక్సెస్ ఫుల్ గా నిలపలేకపోయాడు. నిజానికి ఆయన కెరియర్ లో వచ్చిన ఆహ్వానం, వినోదం, మావిచిగురు, శుభలగ్నం, యమలీల లాంటి సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ బాలకృష్ణ తో చేసిన ‘టాప్ హీరో'(Top Hero) నాగార్జునతో చేసిన వజ్రం(Vazram ) లాంటి సినిమాలు అతనికి పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఇక రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ‘యమలీల’ (Yakaleela) సినిమాని ఆలీతో చేస్తున్నప్పుడు చాలామంది తనని విమర్శించారని అలీ నీ హీరోగా పెట్టడం ఏంటి అంటూ కొంతమంది నటీనటులు సైతం ఆ సినిమాలో మేము నటించమని చెప్పారట. అయినప్పటికి ఆయన ఎక్కడ తగ్గకుండా ఆ సినిమాకి అలీ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడు. ఆయన ఇమేజ్ మాత్రమే సినిమాకి వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే అలీ ని పెట్టి సినిమా చేశాడు. మొత్తానికైతే ఆ సినిమా సంవత్సరం పాటు సక్సెస్ ఫుల్ గా ఆడడమే కాకుండా ఎస్వీ కృష్ణారెడ్డికి గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మన కథ కంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరోని పెట్టుకుంటేనే ఆయన మనం చెప్పినట్టు వింటాడని అలాంటి వారితో ఎలాంటి ఎక్స్పరిమెంట్లైనా చేసి నటింప చేసుకోవచ్చని చెప్పాడు.
Also Read : హిట్ అవ్వాల్సిన మన స్టార్ హీరోల సినిమాలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?
అలా కాకుండా మన కథ కంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న నటులను హీరోలను మన సినిమాల్లో హీరోలుగా తీసుకుంటే మనం చెప్పిన కథను విని, వాళ్లు తమ సొంత సజెషన్స్ ఇస్తూ సినిమాల్లో వాటిని ఇరికించే ప్రయత్నం చేస్తారని అందువల్లే ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటూ ఆయన ఒక మాటయితే చెప్పాడు.
నిజానికి పెద్ద హీరోలకి బ్రెయిన్ ఉండదని ఉన్న బ్రేన్ లోనే ఏదో సలహాలు ఇచ్చి సినిమా కంటెంట్ చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారని ఆయన చెప్పడం ప్రతి ఒక్క హీరో అభిమానుల్లో తీవ్రమైన నిరాశనైతే రేకెత్తిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు.
చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ దగ్గరికి వచ్చిన కథల్లో వేలు పెడుతూ దర్శకుడు ఏం తీయాలనుకుంటున్నాడో అది కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అనే సజెషన్స్ చెప్పి వాటిని చేంజెస్ చేయిస్తూ ఉంటారు. దానివల్ల సినిమా మీద భారీ ఇంపాక్ట్ పడడమే కాకుండా సినిమా డిజాస్టర్ గా మారే అవకాశాలు కూడా ఉంటాయి…