Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఎంతో కష్టపడి ఆట ఆడి గెలుచుకున్న కెప్టెన్సీ అన్యాయంగా లాగేసుకున్నాడు బిగ్ బాస్. ప్రశాంత్ కెప్టెన్ గా తన బాధ్యతలు నిర్వర్తించడం లేదు అని అభిప్రాయపడ్డారు. కెప్టెన్సీ అంటే కేవలం ఇమ్మ్యూనిటీ మాత్రమే కాదు,కెప్టెన్ కి ఉండే బాధ్యతలు, లక్షణాలు ఏంటో తెలుసా ప్రశాంత్ అని బిగ్ బాస్ ప్రశ్నించారు. మీరు చెప్పండి శోభా అనగానే కెప్టెన్ అంటే ఫస్ట్ అందరిని కంట్రోల్ లో పెట్టుకోవాలి అని చెప్పింది.
వరుసగా ఒక్కొక్క హౌస్ మేట్ ని అడిగారు. అందరూ ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. ఆఖరికి శివాజీ కూడా ప్రశాంత్ ని తప్పు బట్టి మాట్లాడాడు. ఇంటి కెప్టెన్ ఎలా ఉండాలి అని బిగ్ బాస్ ప్రశాంత్ ని మళ్ళీ అడిగాడు. కొందరు చెప్పిన వినడం లేదు. చెప్పిన పనులు కూడా చేయడం లేదు. ఏంటి వీడి మాట వినడం అన్నట్లు ఉంటున్నారు అని చెప్పాడు మన రైతు బిడ్డ.
ప్రశాంత్ వరస్ట్ కెప్టెన్ అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి అని హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ కోరాడు. దాదాపు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ చేతులెత్తారు. దీంతో ప్రశాంత్ ని వరస్ట్ కెప్టెన్ భావిస్తూ కెప్టెన్సీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. కెప్టెన్సీ బ్యాడ్జ్ వెనక్కి ఇవ్వాలని చెప్పాడు.ఆ మాట వినగానే ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు. కెప్టెన్సీ బ్యాడ్జ్ తిరిగి ఇచ్చేసాడు. అంత కష్టపడి గెలుచుకున్న కెప్టెన్సీ మూడునాళ్ళ ముచ్చట అయింది. బాధ తట్టుకోలేక రైతు బిడ్డ ఏడ్చేశాడు.
దీంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఆరవ వారానికి 7గురు నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, తేజా, నయని పావని, అశ్విని, పూజా మూర్తి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఓట్ల పరంగా శోభా శెట్టి, పూజా మూర్తి రేసులో వెనుకబట్టట్లు సమాచారం.
Bigg Boss Unveils the Leadership Test: Qualities of a Captain Under Scrutiny!
In a game-changing move, Bigg Boss subjects the contestants to a rigorous examination of the qualities that make a great captain! 😎#BiggBossTelugu7 #Starmaa @iamnagarjuna
Link:https://t.co/VB3l96M4dF— Starmaa (@StarMaa) October 11, 2023