Bichagadu 2 Twitter Review: 2016లో విడుదలైన బిచ్చగాడు ఓ సెన్సేషన్. మదర్ సెంటిమెంట్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. కోటీశ్వరుడు తల్లి కోసం బిచ్చగాడుగా మారడం అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా తోచింది. తెలుగు, తమిళ భాషల్లో బిచ్చగాడు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. పావలా పెట్టుబడికి పది రూపాయల లాభం తెచ్చిన చిత్రం అది. విజయ్ ఆంటోని నటించగా శశి దర్శకత్వం వహించారు. ఆ మూవీ విడుదలై ఆరేళ్ళు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత పార్ట్ 2 చేశారు. బిచ్చగాడు సీక్వెల్ ఎలా ఉంది? పార్ట్ వన్ స్థాయిలో తెరకెక్కించారా? అప్పటి మ్యాజిక్ రిపీట్ అయ్యిందా అంటే…?
బిచ్చగాడు 2 చిత్ర ప్రీమియర్స్ ముగిశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. బిచ్చగాడు చిత్రానికి శశి దర్శకత్వం వహించగా సీక్వెల్ నుండి ఆయన తప్పుకున్నారు. విజయ్ ఆంటోని స్వయంగా నటించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. రెండు భిన్నమైన పాత్రల్లో ఆయన కనిపించారు. స్లమ్ ఏరియాలో దుర్భర జీవితం గడిపే సత్యగా, దేశంలోనే రిచెస్ట్ బిజినెస్ మాన్ విజయ్ గా రెండు పాత్రలు చేశారు.
ఈ రెండు పాత్రల్లో విజయ్ అలరించారు. ఆయన చక్కని వేరియన్స్ చూపించారు. బిచ్చగాడు 2 సైతం విజయ్ వన్ మాన్ షో. ఆయన రాసుకున్న సన్నివేశాలు అలరిస్తాయి. ఎక్కడా విసుగు పుట్టించకుండా మూవీ సాగుతుంది. అయితే బిచ్చగాడు సినిమాకు మదర్ సెంటిమెంట్ ప్లస్ అయ్యింది. ఆ యాంగిల్ బిచ్చగాడు 2 మూవీలో మిస్సయ్యింది. సెంటిమెంట్ పాళ్ళు లేవు. అలాగే లాజిక్ లేని సన్నివేశాలు ఎక్కువయ్యాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారని అంటున్నారు.
బిచ్చగాడు అంత గొప్ప మూవీ కాకపోయినా బిచ్చగాడు 2 సైతం అలరిస్తుంది. ప్రేక్షకులు కోరుకునే అంశాలు బిచ్చగాడు 2 మూవీలో ఉన్నాయని అంటున్నారు. ఈ సమ్మర్ లో ఒకసారి హ్యాపీగా చూసి రావచ్చు. టికెట్ డబ్బులకు న్యాయం చేస్తుందంటుంటారు. విజయ్ ఆంటోనికి జంటగా కావ్య థాపర్ నటించింది. విజయ్ ఆంటోని కార్పొరేషన్ బ్యానర్లో తెరకెక్కించారు. మ్యూజిక్ సైతం విజయ్ అందించారు. ఈ చిత్ర షూటింగ్లో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు.
#Pichaikkaran2 #Bichagadu2 @vijayantony
Decent watch. It’s Vijay Antony show.
My rating 2.75/5
— Movie Life (@MLifeUSA) May 19, 2023
First half is a typical potboiler if we excuse the cinematic liberty. Sathya's slum life, Vijay's billionaire life are handled in an engaging manner so far. The film takes off well but turns into an average formulaic film by the interval. pic.twitter.com/te3QAky1vN
— Telugu360 (@Telugu360) May 19, 2023