https://oktelugu.com/

Bichagadu 2 Collections: ‘బిచ్చగాడు 2 ‘ 6 రోజుల వసూళ్లు.. డివైడ్ టాక్ తో అద్భుతాలు!

కేవలం తెలుగు వెర్షన్ కి 6 కోట్ల 50 లక్షల రూపాయిల బిజినెస్ జరిగింది. 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ఈ చిత్రం ఆరవ రోజు కూడా 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 25, 2023 / 08:53 AM IST

    Bichagadu 2 Collections

    Follow us on

    Bichagadu 2 Collections: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు 2 ‘ చిత్రం రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ పబ్లిక్ టాక్ ని తెచ్చుకొని, వసూళ్ల పరంగా మాత్రం సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై నేటికి ఆరు రోజులు అయ్యింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు మరియు తమిళ భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలకు జరిగింది.

    కేవలం తెలుగు వెర్షన్ కి 6 కోట్ల 50 లక్షల రూపాయిల బిజినెస్ జరిగింది. 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ఈ చిత్రం ఆరవ రోజు కూడా 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషకి వచ్చిన వసూళ్లను కూడా జతపరిస్తే ఆరవ రోజు ఈ చిత్రానికి 1 కోటి 20 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

    అలా ఆరు రోజులకు గాను ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే బయ్యర్స్ 77 లక్షల రూపాయిలు లాభం అన్నమాట. ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లను రాబడితే ఫుల్ రన్ లో కనీసం 5 కోట్ల రూపాయిలు లాభం వస్తుందని అంటున్నారు. కేవలం డివైడ్ టాక్ వస్తేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక ‘బిచ్చగాడు’ రేంజ్ టాక్ వచ్చి ఉంటే ఇక ఏ రేంజ్ వసూళ్లు వచ్చి ఉండేవో అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు.

    మరోపక్క తమిళం లో కూడా కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు 13 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. మరో కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అలా ఈ సమ్మర్ లో సరైన సినిమా లేని సందర్భం చూసి బిచ్చగాడు బాక్స్ ఆఫీస్ వసూళ్లను మొత్తం కాజేసాడు.