https://oktelugu.com/

Bichagadu 2 Collections: బిచ్చగాడు ముందు తేలిపోయిన ‘సింహాద్రి’..2వ రోజు అదిరిపోయే వసూళ్లను నమోదు చేసిన ‘బిచ్చగాడు 2’

సుమారుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని మొదటి రోజు రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు కూడా మార్నింగ్ షోస్ నుండే చాలా స్ట్రాంగ్ గా ఆక్యుపెన్సీలతో ప్రారంభం అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 20, 2023 / 05:41 PM IST

    Bichagadu 2 Collections

    Follow us on

    Bichagadu 2 Collections: టాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుంది అని చెప్పడానికి లేటెస్ట్ ఉదాహరణ ‘బిచ్చగాడు 2’.2016 వ సంవత్సరం లో చిన్న డబ్బింగ్ సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ చిత్రం మేనియా ముందు కొట్టుకుపోయాయి.

    ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయ్యినప్పుడు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయి ఈ చిత్రానికి. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతలా నచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అంటే చూడకుండా ఎలా ఉంటారు?, నిన్న గ్రాండ్ గా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ,ఓపెనింగ్స్ పరంగా మాత్రం దుమ్ము లేపేసింది.

    సుమారుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని మొదటి రోజు రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు కూడా మార్నింగ్ షోస్ నుండే చాలా స్ట్రాంగ్ గా ఆక్యుపెన్సీలతో ప్రారంభం అయ్యింది.నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు, ఆ చిత్రం కలెక్షన్స్ ఎఫెక్ట్ ఈ సినిమాకి చాలా బలంగా పడుతుంది అని అనుకున్నారు.

    కానీ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్య పర్చేలా నూన్ షోస్ నుండే బిచ్చగాడు 2 చిత్రం ప్రధాన నగరాల్లో ‘సింహాద్రి’ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి అందరినీ షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా వైజాగ్ వంటి ప్రాంతాలలో ప్రతీ సెంటర్ సింహాద్రి కంటే రెండు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టడం విశేషం.6 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా, మూడవ రోజుతో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.