https://oktelugu.com/

Bichagadu 2 Collections: ‘బిచ్చగాడు 2 ‘ 10 రోజుల వసూళ్లు..బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్న విజయ్ ఆంటోనీ

కేవలం థియేటర్స్ లోనే కాదు, బుల్లితెర మీద కూడా ఈ చిత్రం ఒక ప్రభంజనం, ఇక్కడి స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ టీఆర్ఫీ రేటింగ్స్ ని అందుకుంది. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ తీస్తే తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ప్రోత్సహిస్తారో రీసెంట్ గా విడుదలైన 'బిచ్చగాడు 2 ' చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 29, 2023 / 08:19 AM IST

    Bichagadu 2 Collections

    Follow us on

    Bichagadu 2 Collections: తెలుగు లో డబ్బింగ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడం కొత్తేమి కాదు, మన టాలీవుడ్ ఆడియన్స్ తమిళ డబ్బింగ్ సినిమాలకు అత్యధిక శాతం బ్రహ్మరథం పట్టారు.అలా అసలు తెలుగు ఆడియన్స్ కి ఒకప్పుడు పరిచయం లేని ‘విజయ్ ఆంటోనీ’ నటించిన ‘బిచ్చగాడు’ అనే చిత్రానికి ఆరోజుల్లోనే 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు ఇచ్చారంటే, మన తెలుగు ఆడియన్స్ మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

    కేవలం థియేటర్స్ లోనే కాదు, బుల్లితెర మీద కూడా ఈ చిత్రం ఒక ప్రభంజనం, ఇక్కడి స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ టీఆర్ఫీ రేటింగ్స్ ని అందుకుంది. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ తీస్తే తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ప్రోత్సహిస్తారో రీసెంట్ గా విడుదలైన ‘బిచ్చగాడు 2 ‘ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది.

    ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రాలేదు, మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. 6 కోట్ల 50 లక్షల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా, 5 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది. అలా సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకున్న ఈ చిత్రం నిన్నటితో పది రోజులు పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి, అంటే పెట్టిన డబ్బులకు దాదాపుగా రెండు కోట్ల రూపాయిలు లాభం అన్నమాట.అలాగే ఈ చిత్రం తమిళం లో కూడా ఇదే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంది.

    అక్కడ ఈ చిత్రానికి ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. మొత్తానికి రెండు భాషలకు కలిపి బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటేసింది. ప్రస్తుతం హిట్ స్టేటస్ లో ఉన్న ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. డివైడ్ టాక్ తోనే ఈ రేంజ్ వసూళ్లు అంటే, సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే కచ్చితంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేదని, విజయ్ ఆంటోనీ బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.