BholaaShankar JamJamJajjanaka Song : ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం ‘భోళా శంకర్’. ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, AK ఎంటర్టైన్మెంట్స్ మీద అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. వచ్చే నెల 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన రెండవ లిరికల్ వీడియో సాంగ్ ‘జామ్ జామ్ జజ్జనక’ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది.
ఈ పాట కి సంబంధించిన ప్రోమో ని నిన్ననే విడుదల చేసింది మూవీ టీం, ఈ ప్రోమో చూడగానే ఈ సాంగ్ ఎదో పెద్ద చార్ట్ బస్టర్ అయ్యేట్టు ఉందని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టు గానే ఈ పాట మొదటిసారి వినగానే మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. చాలా అరుదుగా మాత్రమే కొన్ని పాటలు మనకి మొదటిసారి విన్నప్పుడే నచ్చేస్తుంది, అందులో ఈ సాంగ్ కూడా ఒకటి.
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ ని ఎంత వాడుకుంటే అంత మంచి వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు. ఈ పాటలో కూడా మెగాస్టార్ తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్మెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయనతో పాటు ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించిన సుశాంత్, హీరోయిన్ తమన్నా, మరియు చిరంజీవి కి సోదరి గా నటించిన కీర్తి సురేష్, ఇలా వీళ్లందరి డ్యాన్స్ చూసేందుకు చాలా చక్కగా అనిపించింది.
మొత్తం మీద ఈ పాటకి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద రోజు రోజుకి అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. పేరుకు మాత్రమే రీమేక్ కానీ, సినిమా మొత్తం మెగాస్టార్ చిరంజీవి ఇమేజి కి తగ్గట్టుగా మార్చేసినట్టు సమాచారం, ప్రమోషనల్ కంటెంట్ మొత్తాన్ని చూస్తుంటే చిరంజీవి కి మరో వంద కోట్ల రూపాయిల షేర్ సినిమా వచేసినట్టే అని అనిపిస్తుంది.