Bhola Shankar : ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మొదట్లో అసలు అంచనాలే ఉండేవి కాదు.కానీ ఎప్పుడైతే రీసెంట్ సమయం లో వర్కింగ్ పోస్టర్స్ వదిలారో, అందులో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ చూసి ఈ చిత్రం మీద నిదానంగా అంచనాలు పెంచుకోవడం మొదలు పెట్టారు.
ఈ సినిమా పై ఫ్యాన్స్ మొదట్లో అంచనాలు పెంచుకోకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ లో రీమేక్ సినిమాలు ఆడడం లేదు. దానికి తోడు ‘భోళా శంకర్’ చిత్రం 8 ఏళ్ళ క్రితం తమిళం లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ కి రీమేక్.పైగా మెహర్ రమేష్ కి కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. అందుకే ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ ప్రారంభం లో పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.
ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమో ని విడుదల చేసింది మూవీ టీం. ఈ ప్రోమో లో మెగాస్టార్ మార్క్ స్టెప్పులతో కూడా మాస్ ఫోటోలను పెట్టారు కానీ, పాటకి సంబంధించి చిన్న లిరిక్ కూడా విడుదల చెయ్యలేదు. ఇది కాస్త అభిమానులను నిరాశకి గురి చేసింది.కానీ వింటేజ్ చిరంజీవి కనిపించబోతున్నాడు అనే సంకేతాలు రావడం తో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఫుల్ పాట ని ఈ నెల నాల్గవ తేదీన విడుదల చేయబోతున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ కుమారుడు మహతి సాగర్ వ్యవహరిస్తున్నాడు. ఇందులో మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ లో మూడు అద్భుతమైన పాటలను అందించాడట, థియేటర్స్ లో ఈ పాటలు వచ్చినప్పుడు అభిమానులెవ్వరూ కూడా సీట్స్ లో కూర్చోరని చెప్తున్నారు ఫ్యాన్స్. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి