Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీ చిరంజీవి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ దిశగా వెళుతోంది. మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతున్న భోళా శంకర్ సోమవారం మొత్తంగా కుదేలైంది. ప్రేక్షకులకు భోళా శంకర్ చిత్రం మీద అసలు ఆసక్తి లేదని తేలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు భోళా శంకర్ కేవలం రూ. 18 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. నైజాంలో భోళా శంకర్ సోమవారం రూ. 6 లక్షల వసూళ్ళు అందుకుంది. చెప్పాలంటే ఇది ఒకటి రెండు థియేటర్స్ వసూళ్లకు సమానం.
అంటే భోళా శంకర్ థియేటర్స్ పూర్తిగా ఖాళీ అయ్యాయి. షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. భోళా శంకర్ థియేటర్స్ జైలర్ మూవీతో రీప్లేస్ చేస్తున్నారు. జైలర్ సోమవారం నైజాంలో రూ. 1.71 కోట్లు షేర్ వసూలు చేసింది. నైజాంలో 5 రోజులకు గాను రూ. 10.5 కోట్ల షేర్ రాబట్టింది. భోళా శంకర్ మూవీ మాత్రం ఇప్పటి వరకు రూ. 6.7 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది.
భోళా శంకర్ 4 రోజులకు రూ. 26 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. నేడు ఇండిపెండెన్స్ డే. సెలవు దినం కాగా భోళా శంకర్ వసూళ్లు కొంత మెరుగయ్యే అవకాశం కలదు. మొదటి వారం ముగియకుండానే భోళా శంకర్ బాక్సాఫీస్ జర్నీ ముగిసింది. దాదాపు రూ. 50 కోట్లకు పైగా నష్టాలు ఈ చిత్రం మిగల్చనుంది. వరల్డ్ భోళా శంకర్ చిత్ర హక్కులు రూ. 79.5 కోట్లు. చాలా ఏరియాల్లో నిర్మాత అనిల్ సుంకర స్వయంగా విడుదల చేశారు.
రూ. 80 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన భోళా శంకర్ యాభై శాతం వసూళ్లు కూడా సాధించలేదు. భోళా శంకర్ తమిళ చిత్రం వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. కీలకమైన చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.