Bheemla Nayak Remake In Hindi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుపాటి కాంబినేషన్ లో ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ అయినా చిత్రం భీమ్లా నాయక్..చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ సినిమా చెయ్యడం తో ఈ మూవీ పై అంచనాలు విడుదలకి ముందు నుండే తార స్థాయిలో ఉండేవి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రం గా నిలిచింది..ఈ సినిమా విడుదల సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండడం వల్ల ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేసింది..అతి తక్కువ టికెట్ రేట్స్ పెట్టి కలెక్షన్స్ పై తీవ్రమైన ప్రభావం చూపేలా చేసింది..కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ సినిమా తక్కువ టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ కూడా 100 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది.

Also Read: Star Hero Who Missed Vakeel Saab: వకీల్ సాబ్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?
ఇది ఇలా ఉండగా ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనం కోశియుమ్ అనే సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..కానీ ఒరిజినల్ వెర్షన్ కంటే మన తెలుగు వెర్షన్ లోనే ఈ సినిమాని అద్భుతంగా రాసుకున్నాడు త్రివిక్రమ్..రన్ టైం కూడా చాలా షార్ప్ గా పెట్టి ఆడియన్స్ కి బోర్ కొట్టించే ఫీలింగ్ ని రానివ్వకుండా చేసాడు..అందుకే ఈ సినిమా లో స్టోరీ మరియు కంటెంట్ పెద్దగా లేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది..ఇప్పుడు ఈ సినిమాని హిందీ లో రీమేక్ చెయ్యడానికి అక్కడి స్టార్ హీరోలు ఎగబడుతున్నారట..వాస్తవానికి భీమ్లా నాయక్ సినిమా ఒక్కేసారి తెలుగు తో పాటుగా హిందీ లో కూడా విడుదల అవ్వాల్సింది..హిందీ వెర్షన్ కి ఒక్క సెపరేట్ ట్రైలర్ ని కూడా కట్ చేసారు..కానీ వరుసగా #RRR , KGF వంటి పాన్ ఇండియన్ సినిమాలు విడుదల అవ్వడం తో ఈ చిత్రాన్ని హిందీ లో విడుదల చేయలేకపోయారు..ఇప్పుడు ఈ సినిమాని హిందీ లో రీమేక్ చెయ్యడానికి అక్కడి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం..ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు..ఇందులో రానా దగ్గుపాటి పాత్రకి జాన్ అబ్రహం ని తీసుకున్నారు..మరి పవన్ కళ్యాణ్ పాత్రకి ఎవరిని తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..టాలీవుడ్ లో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీమేక్ ..బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: Vikram Closing Collections: విక్రమ్ క్లోసింగ్ కలెక్షన్స్.. లాభాల్లో సరికొత్త రికార్డ్
[…] […]
[…] […]