Bheemla Nayak vs Akhanda Pushpa Collections: భీమ్లానాయక్ మేనియా మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ భీమ్లా నాయక్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25, 2022న థియేటర్లలో తుఫానులా విరుచుకుపడింది. ఈ సమ్మర్ వేడిని భీమ్లానాయక్ మొదలుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి.
Bheemla Nayak vs Akhanda Pushpa Collections
వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా భీమ్లానాయక్ తో వస్తున్నారు. ఆ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమెరికాలో ఇప్పటికే ప్రీ షోస్ పడ్డాయి. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.
Bheemla Nayak vs Akhanda Pushpa Collections
భీమ్లానాయక్ రిలీజ్ కు ముందు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు రెండు. అవి ‘అఖండ’, ‘పుష్ప’. ఇక కరోనా కల్లోలం వేళ ఆంక్షల మధ్య విడుదలైన ‘అఖండ’ మూవీ 69.40 కోట్లు టోటల్ వసూలు చేసింది. థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీ ఉన్న సమయంలోనే విడుదలైన అఖండ 69.40 కోట్లు సాధించి లాభాల బాటపట్టింది. సినిమా బడ్జెట్ ను మించి వసూళ్లు సాధించింది బాలయ్య ‘అఖండ’ చిత్రం.
ఇక పుష్ప సినిమా తెలుగులోనే కాదు.. దక్షిణాది, బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యింది. రికార్డుల మోత మోగించింది. పుష్ప టోటల్ కలెక్షన్స్ రూ.311 కోట్లుగా ఉంది. ఇక భీమ్లా నాయక్ కలెక్షన్ల సునామీనీ మొదలు పెట్టింది. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.
ఇక రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా అఖండ, పుష్ప మూవీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే అఖండ రికార్డులను అధిగమించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఇప్పుడు ‘పుష్ప’ రికార్డులను కూడా అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Akhanda vs Bheemla Nayak Records: అఖండ వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?
Recommended Video: