Bheemla Nayak US Premiere Collections: భీమ్లానాయక్ మేనియా మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-ప్యాక్డ్ బ్లాక్‌బస్టర్ భీమ్లా నాయక్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25, 2022న థియేటర్లలో తుఫానులా విరుచుకుపడింది. ఈ సమ్మర్ వేడిని భీమ్లానాయక్ మొదలుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్‌లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు క్యూలో ఉన్నాయి.

వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి గొప్ప పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా భీమ్లానాయక్ తో వస్తున్నారు. ఆ విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అమెరికాలో ఇప్పటికే ప్రీ షోస్ పడ్డాయి. అమెరికా వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఇప్పటికే 122 థియేటర్లలో విడుదలైంది. ముందస్తు బుకింగ్స్ తో 5,00,000 డాలర్ల మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది.
Also Read: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ట్విట్టర్ రివ్యూ
భీమ్లా నాయక్ ప్రీమియర్ షోతో పవన్ కళ్యాణ్ తన రికార్డులను తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రీ-రిలీజ్ బుకింగ్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాతలకు భీమ్లానాయక్ ముందస్తు బుకింగ్స్ తో కాసుల వర్షం కురుస్తోంది. థియేటర్లన్నీ ముందస్తు బుకింగ్స్ తో నిండిపోయాయి. రోజుల్లో భారీ టిక్కెట్ల విక్రయాలు పూర్తిగా అమ్మడైపోయాయి.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెరికాలోనే కాకుండా భారతదేశంలోని అనేక థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటోంది.
సినిమా రిలీజ్ డేట్ రివీల్ అయినప్పటి నుంచి అభిమానులు ఎంతగానో భీమ్లానాయక్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ ను థియేటర్లలో చూడాలని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ అంచనాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం బుక్ మై షో యాప్ సమస్యలు కూడా తెలంగాణలో పరిష్కారమయ్యాయి. బుకింగ్‌లు పూర్తి స్వింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఆన్‌లైన్ పోర్టల్ తెరవబడిన వెంటనే హైదరాబాద్‌లో ఇప్పటికే 1 కోటి మార్కును దాటేసినట్టు సమాచారం. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా భీమ్లానాయక్ మూవీకి మంచి టాక్ వస్తే రికార్డు కలెక్షన్లు రావడం ఖాయం.
Also Read: ‘భీమ్లా నాయక్’ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !
Recommended Video:
[…] […]
[…] Nisha Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతున్నసంగతి తెలిసిందే. కాగా కాజల్ అగర్వాల్‌తో దిగిన క్యూట్ ఫొటోను ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఇన్‌స్టాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ‘నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. ఈ గర్భంలో ఉన్న నిన్ను నేను తాకుతున్నా. నిన్ను కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా లిటిల్ లవ్’ అంటూ ఎమోషనల్ అయిపోతూ ఒక మెసేజ్ పెట్టింది. […]
[…] Pawan Kalyan Fans and AP Ministers: ఆంధ్రప్రదేశ్ లో భీమ్లానాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. ప్రభుత్వ నిర్వాకంతో నిరసన గళం విప్పుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. సినిమా రంగాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ మొండివైఖరిపై అందరిలో కూడా ఆగ్రహావేశాలు వస్తున్నాయి. […]