Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak Twitter Review: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ట్విట్టర్ రివ్యూ

Bheemla Nayak Twitter Review: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ట్విట్టర్ రివ్యూ

Bheemla Nayak Twitter Review: పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ తో వస్తున్న మూవీ ‘భీమ్లానాయక్’. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా ప్రత్యర్థులుగా తలపడుతున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు నటించారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ. 109.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 110 కోట్ల బిజినెస్ చేయాలి. 2022లో ఈ రేంజ్‌లో ప్రీ రిలీజ్ చేసిన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం.

Bheemla Nayak Twitter Review
Bheemla Nayak First Day US Collections!

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి, ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే బీమ్లా నాయక్ అసలు కథ. ఈ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో తన నటవిశ్వరూపం అభిమానులకి చూపించాడు. ఇక భారీ అంచనాల మధ్య అభిమానుల ముందుకి వచ్చిన బీమ్లానాయక్ .. తోలి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది లో విడుదల అయిన భారీ చిత్రం బీమ్లానాయక్ కావడం మరో విశేషం.

ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ నటన చూసి అభిమానులు , సినీ స్టార్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. పవన్ తన సహజసిద్ధమైన నటన తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడని ..అసలు తెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తేనే అదొక మ్యాజిక్ అంటూ అభిమానులు చెప్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా పవన్ అలాగే రానా గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. హీరో అయినప్పటికీ నెగటివ్ రోల్స్ లో కూడా రానా నటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడని పవన్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా రానా నటించాడని చెప్తున్నారు. అలాగే హీరోయిన్ నిత్యామీనన్ తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది.

Also Read: Bandla Ganesh Comments on Bheemla Nayak Movie: రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లైపోవాలి.. భీమ్లానాయ‌క్ మీద బండ్ల గ‌ణేశ్ కామెంట్స్‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

https://twitter.com/shivainn/status/1497009212865810432?s=20&t=mSzYe_Rk62BiNXPNB7aR8g

మురళీశర్మ , సముద్రఖని మరోసారి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. థమన్ స్వరపరిచిన పాటలు సినిమాకి మరో ప్లస్ అయ్యిందని చెప్పాలి. మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం తోలి షో నుండి పూర్తీ పాజిటివ్ మౌత్ టాక్ తో ముందుకి సాగుతూ బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలవడానికి పరుగులు తీస్తుంది.

Also Read: Bheemla Nayak Ticket Price in AP: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?

Recommended Video:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

5 COMMENTS

  1. […] భీమ్లానాయక్ రిలీజ్ కు ముందు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలు రెండు. అవి ‘అఖండ’, ‘పుష్ప’. ఇక కరోనా కల్లోలం వేళ ఆంక్షల మధ్య విడుదలైన ‘అఖండ’ మూవీ 69.40 కోట్లు టోటల్ వసూలు చేసింది. థియేటర్లపై ఆంక్షలు.. 50శాతం అక్యూపెన్సీ ఉన్న సమయంలోనే విడుదలైన అఖండ 69.40 కోట్లు సాధించి లాభాల బాటపట్టింది. సినిమా బడ్జెట్ ను మించి వసూళ్లు సాధించింది బాలయ్య ‘అఖండ’ చిత్రం. […]

  2. […] KTR- Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ క‌ష్టాలు తీర‌డం లేదు. ఇందులో రాజ‌కీయ వైష‌మ్యాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇటీవ‌ల విడుద‌లైన భీమ్లానాయ‌క్ సినిమాపై ప్ర‌భావం చూపుతున్నాయి. గ‌తంలోనే ఏపీలో వైసీపీ నిర్ణ‌యాల‌పై నిర‌స‌న గ‌ళం విప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎవ‌రు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న కూడా ఏం చేయ‌లేక‌పోయారు. కానీ ఇటీవ‌ల చిత్ర‌ప‌రిశ్ర‌మ పెద్ద‌లు సీఎం జ‌గ‌న్ ను క‌లిసి సినిమా రంగాన్ని బ‌తికించాల‌ని కోరిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వంలో సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ ప‌రిస్థితిలో మార్పు లేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారింది ప‌రిస్థితి. […]

  3. […] Ravindra Jadeja Pushpa Dialogue: పుష్ప వ‌చ్చి దాదాపు రెండు నెల‌లు దాటిపోయింది. అయినా ఇంకా దాని ఫీవ‌ర్ పోవ‌డం లేదు. హైద‌రాబాద్ నుంచి మొద‌లు పెడితే అమెరికా దాకా.. విజ‌య‌వాడ నుంచి మొద‌లు పెడితే ఆస్ట్రేలియా దాకా అంత‌టా పుష్ప మేనియానే క‌నిపిస్తోంది. ఏ ముహూర్తాన సినిమాను రిలీజ్ చేశారో గానీ.. అందులో ఉన్న డైలాగులు, హుక్ స్టెప్ ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్నాయి. […]

  4. […] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. “గంగూబాయి కతీయవాడి” బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. భారీ అంచనాలు నడుమ ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి.. “RRR ” టీం తమ స్పెషల్ విషెష్ ని తెలియజేసారు. మా డియరెస్ట్ ఆలియా అండ్ గంగూబాయి టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నామని “RRR ” టీం ట్విట్టర్ వేదికగా తెలిపారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular