BHEEMLA NAYAK: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా భీమ్లా నాయక్. మలయాళం చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా, కొత్త అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా లాలా భీమ్లా ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుటు ఆ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. సౌండ్ ఆఫ్ భీమ్లానాయక్ పేరుతో మూడో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
లాలా భీమ్లా.. అడవి పులి అంటూ సాగే పాటలో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ పాటను రచించడం విశేషం. కాగా, త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. అరుణ్ కౌండిన్య ఈ పాటను ఆలపించారు. కాగా, ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే భారీ వ్యూస్‌తో నెట్టింట దూసుకెళ్లిపోతోంది. మరోవైపు ఈ సినిమాలో రానా కీలక పాత్ర పోషించడం మరింత ఆసక్తి రేపుతోంది. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యామేనన్ కనిపించనుండగా.. రానా సరసన సంయుక్త మేనన్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
మరోవైపు, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఒకే చెప్పిన పవన్.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పిరియాడికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై బారీ అంచనాలు నెలకొన్నాయి.