Bheemla Nayak Free Show: “భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేసింది. ‘భీమ్లా నాయక్’ సక్సెస్ తో ఫ్యాన్స్ అండ్ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మహిళా పోలీస్ సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్.

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ రోజు సాయంత్రం 6గంటలకు భీమ్లా నాయక్ సినిమా ఉచితంగా చూపించనున్నారు. దీంతో మహిళా పోలీస్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు కమీషనర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also Read: Prabhas Marriage Date: ప్రభాస్ పెళ్లి తేదీ అదే.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ వ్యక్తి
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రానికి సాగర్ కె దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. మొత్తానికి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు.
బాణాసంచా కాల్చి, డ్యాన్సులు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ సినిమా పై భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం హ్యాపీగా ఉందని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.