https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లానాయక్​ నుంచి క్రేజీ అప్​డేట్​.. ట్రైలర్​ అప్పుడేనట?

Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతికి  స్టార్​ హీరోలు బరిలోకి దిగనున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఈ పోరులో పాటీపడనున్నాయి. జనవరి 7న ఆర్​ఆర్​ఆర్​ సినిమా విడుదల కానుండగా.. 13న భీమ్లానాయక్​, 14న రాధేశ్యామ్​ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈరోజు విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మరోవైపు భీమ్లానాయక్​గా తన పవర్​ చూపించేందుకు పవన్​కళ్యాణ్​ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్​పై వేరే లెవెల్​లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 12, 2021 / 10:07 AM IST
    Follow us on

    Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతికి  స్టార్​ హీరోలు బరిలోకి దిగనున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఈ పోరులో పాటీపడనున్నాయి. జనవరి 7న ఆర్​ఆర్​ఆర్​ సినిమా విడుదల కానుండగా.. 13న భీమ్లానాయక్​, 14న రాధేశ్యామ్​ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈరోజు విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మరోవైపు భీమ్లానాయక్​గా తన పవర్​ చూపించేందుకు పవన్​కళ్యాణ్​ బరిలోకి దిగుతున్నారు.

    ముఖ్యంగా ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్​పై వేరే లెవెల్​లో అంచనాలు ఉన్నాయి. ఇందులో నిత్యా మేనన్​ సంయుక్త మేనన్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్​ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్​ మాటలు, స్క్రీన్​ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, ప్రోమో, పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్​డేట్​ వినిపిస్తోంది.

    అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లానాయక్​ ట్రైలర్​ కట్​ పనులను రీసెంట్​గా ముగంచారట. ఇక విడుదల చేయడమే తర్వాయి అని అంటున్నారు. అయితే, డిసెంబరు 14న రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ ట్రైలర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి అది ట్రైలర్​ఆ కాగా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్​ స్వరాలు అందిస్తున్నారు. సితారా ఎంటర్​టైన్​మెంట్​ పతాకంపై తెరకెక్కుతోన్న ఈసినిమాలో భీమ్లా నాయక్​గా పవన్​ కనిపించనుండగా.. డేనియల్​ శేఖర్​గా రానా కనువిందు చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా భీమ్లానాయక్​ విడుదల కానుంది.