https://oktelugu.com/

Bheemla Naik Update: భీమ్లా నాయక్ ‘డానియల్ శేఖర్’ అప్డేట్ వచ్చేసింది

Bheemla Naik Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా ప్రత్యర్థులుగా నటిస్తున్న పవర్ ప్యాక్డ్ మూవీ ‘భీమ్లా నాయక్’. మల్లీస్టారర్ గా రూపొందుతున్న ఈ రిమేక్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ గ్లింప్స్ కు భారీ స్పందన వచ్చింది. తాజాగా విలన్ అయిన రానా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల […]

Written By: , Updated On : September 17, 2021 / 09:03 PM IST
Follow us on

Bheemla Naik Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా ప్రత్యర్థులుగా నటిస్తున్న పవర్ ప్యాక్డ్ మూవీ ‘భీమ్లా నాయక్’. మల్లీస్టారర్ గా రూపొందుతున్న ఈ రిమేక్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ గ్లింప్స్ కు భారీ స్పందన వచ్చింది. తాజాగా విలన్ అయిన రానా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది.

‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్టుగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో రానా ఠీవీగా వెనుకవైపు ముఖం కనిపించకుండా నిలబడి ఉన్నాడు. పంచె లేపి ప్రత్యర్థి ‘భీమ్లా నాయక్’ పవన్ తో యుద్ధానికి సై అన్నట్లుగా పోస్టర్ లో చూపించారు.

పవన్, రానా హీరోలుగా నటిస్తున్న ఈ మూవీకి సాగర్ కే చంద్ర దర్శకుడు. దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు,స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్, రానా జంటగా ఐశ్వర్యరాజేశ్ నటిస్తున్నారు.

తాజాగా 20న రానాకు సంబంధించిన అప్డేట్, పోస్టర్ టీజర్ ను విడుదల చేయనున్నట్టు చిత్రంయూనిట్ ప్రకటించింది. పవన్ టీజర్ ఇప్పటికే ఉర్రూతలూగించగా.. ఇప్పుడు రానా ఎలా ఉంటుందోనని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.