Bhartha Mahasayulaku Wignyapthi First Review: రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను అలంకరించే ప్రయత్నం చేయబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినీ సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారట. మరి ఈ షో ని బట్టి చూస్తే ఈ సినిమా ఎలా ఉంది ఒకసారి ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రవితేజ డింపుల్ హయతే ను పెళ్లి చేసుకుని తన లైఫ్ ను తను సాఫీగా సాగిస్తున్న క్రమంలో అతనికి ఆషిక రంగనాథన్ పరిచయం అవుతుంది. ఇక ఈ క్రమంలోనే రవితేజ ఆమెతో ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటాడు. ఇక వీళ్లిద్దరి మధ్య తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు. ఇటు భార్య పెట్టే వేధింపులు అటు ప్రేయసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అనే ఇబ్బందులకు గురి చేయడంతో రవితేజ ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నాడు అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది…
ఇక ఈ సినిమాలో రవితేజ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ ని పోషించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్ లో ఉండే బంధాలను సైతం దర్శకుడు చాలా గొప్పగా చూపించారట. రవితేజ తన వైఫ్ ని ఎలా ట్రీట్ చేశాడు అనేది కూడా ఈ సినిమాలో స్పెషల్ గా కనిపించబోతున్న ఎలిమెంట్ గా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ గొడవలు మీద ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ని కలిగిస్తాయని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా భార్య చేతిలో లవర్ చేతిలో నలిగిపోయే క్యారెక్టర్ లో రవితేజ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సాంగ్స్ ఓకే అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ తో బీమ్స్ అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా హైలెట్ కాబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది…