Bigg Boss 9 Bharani Injured: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఆడియన్స్ ని బాగా ఎమోషనల్ కి గురి చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే అది భరణి దే. మంచి మనిషిని బయటకు పంపేశారు అనే బాధ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండేది. ఆడియన్స్ నుండి ఆయన రీ ఎంట్రీ డిమాండ్ ఎక్కువ ఉండడం తో, నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి భరణి మరియు శ్రీజ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే నిన్న రాత్రి ఒక ఫిజికల్ టాస్క్ ని నిర్వహించారట. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరికీ భారీగా గాయాలు అయ్యాయి అట. భరణి కి అయితే ఎక్కడ దారుణంగా గాయాలు అయ్యాయి అని, స్విమ్మింగ్ పూల్ లో కుప్పకూలి పడిపోవడం తో ఆయన్ని వెంటనే బిగ్ బాస్ హౌస్ మెయిన్ డోర్ నుండి హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ప్రస్తుతానికి భరణి హాస్పిటల్ లోనే ఉన్నాడు. రిబ్స్ వద్ద ఫ్రాక్చర్స్ జరిగాయో లేవో టెస్టులు చేస్తున్నారు. భరణి ఫిజికల్ గా ఆటలు భవిష్యత్తులో ఆడే విధంగా ఉంటే ఆయన కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ అడుగుపెడతాడు. లేదంటే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి వచ్చే అవకాశాలు లేవు. అసలు భరణి, శ్రీజ ని ఎలా హౌస్ లోకి రానిచ్చారంటే, గతం లో లాగానే పాత కంటెస్టెంట్స్ అందరూ మరోసారి లోపలకు వచ్చారట. తాము ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ రావాలని అనుకుంటున్నారో కంటెస్టెంట్స్ కి చెప్తారట. వాళ్ళ ఓటింగ్ ద్వారా మాత్రమే వీళ్లిద్దరు హౌస్ లోకి అడుగుపెట్టారట. భరణి పాపం ఈసారి చాలా గట్టిగా ఆడాలనే వచ్చాడు, అందుకే టాస్క్ పరంగా ప్రాణం పెట్టి ఆడాడు, చివరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.
ఆయన త్వరగా కోలుకొని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ భరణి హౌస్ లోకి రాలేకపోతే, ఆయన స్థానం లో మనీష్ లేదా ప్రియా వచ్చే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. కంటెస్టెంట్స్ అందరికీ అంతలా గాయాలు అయ్యే విధమైన టాస్క్ ఏమి అయ్యుంటుంది?, భరణి కి ఎందుకు అంతటి తీవ్ర గాయాలు అయ్యాయి అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. భరణి కి గాయాలైన తర్వాత హౌస్ మేట్స్ అందరూ షాక్ కి గురయ్యారట. ముఖ్యంగా తనూజ, దివ్య వంటి వారు అయితే వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశారట. ఈ టాస్క్ లో భరణి కోసం ఇమ్మానుయేల్ మరియు నిఖిల్ సపోర్టుగా నిలబడగా, శ్రీజ కోసం డెమోన్, గౌరవ్ సపోర్టుగా నిలబడ్డారట.