https://oktelugu.com/

ఆకట్టుకుంటున్న ‘భానుమతి-రామకృష్ణ’ ట్రైలర్

30ఏళ్లు పైబడిన యువతీ యువకుల మధ్య ప్రేమ.. అనే కొత్త తరహా కాన్సెప్ట్ తో ‘భానుమతి-రామకృష్ణ’ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇప్పటివరకు టీనేజీ అబ్బాయి, అమ్మాయిల లవ్ స్టోరీలు అనేకం వచ్చాయి. అలాగే అబ్బాయి అమ్మాయి వెంటపడటం లాంటి రోటీన్ ప్రేమ కథలు వచ్చాయి. వీటికి భిన్నంగా తొలిసారి 30ఏళ్లు పైబడిన ఇద్దరి యువతీ యువకుల ప్రేమ కథాంశంతో ఓ మూవీ రాబోతుంది. టాలీవుడ్లో గతంలో ‘మల్లీశ్వరీ’ మూవీలో విక్టరీ వెంకటేష్ పెళ్లికానీ ప్రసాద్ గా అలరించాడు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 26, 2020 / 07:34 PM IST
    Follow us on


    30ఏళ్లు పైబడిన యువతీ యువకుల మధ్య ప్రేమ.. అనే కొత్త తరహా కాన్సెప్ట్ తో ‘భానుమతి-రామకృష్ణ’ వెబ్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇప్పటివరకు టీనేజీ అబ్బాయి, అమ్మాయిల లవ్ స్టోరీలు అనేకం వచ్చాయి. అలాగే అబ్బాయి అమ్మాయి వెంటపడటం లాంటి రోటీన్ ప్రేమ కథలు వచ్చాయి. వీటికి భిన్నంగా తొలిసారి 30ఏళ్లు పైబడిన ఇద్దరి యువతీ యువకుల ప్రేమ కథాంశంతో ఓ మూవీ రాబోతుంది. టాలీవుడ్లో గతంలో ‘మల్లీశ్వరీ’ మూవీలో విక్టరీ వెంకటేష్ పెళ్లికానీ ప్రసాద్ గా అలరించాడు. ఈ మూవీలో మాత్రం అమ్మాయికి 30ఏళ్లు దాటి పెళ్లికాకుండా కన్పిస్తుంది. తనకు 30ఏళ్లు అని ఎవరైనా గుర్తుచేస్తే ఎదుటివాళ్లపై ఉక్రోషం చూపిస్తుంటోంది. ఆమె ఫ్రస్టేషన్ ప్రేక్షకులను వినోదాన్ని పంచుతోంది.

    తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. 3.09నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి ఎంచుకున్నాడు. ఈ మూవీలో అందాల రాక్షసి ఫేం హీరో నవీన్ చంద్ర, సలోని లుత్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, కృషి ప్రొడక్షన్స్ బ్యాన్సర్లో యశ్వంత్ మలుకుట్ల ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఆద్యంతం ఎంటటైన్మెంట్ పంచుతూ ఈ మూవీ ట్రైలర్ సాగింది. నెటిజిన్ల నుంచి ఈ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

    https://www.youtube.com/watch?v=d9L-6-FBOd4