Homeఎంటర్టైన్మెంట్Bhairavam Twitter Review : భైరవం ట్విట్టర్ రివ్యూ: ఆ ముగ్గురు హీరోలకు కమ్ బ్యాక్...

Bhairavam Twitter Review : భైరవం ట్విట్టర్ రివ్యూ: ఆ ముగ్గురు హీరోలకు కమ్ బ్యాక్ ఇస్తుందా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే

Bhairavam Twitter Review : దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవం మూవీ తీవ్ర వ్యతిరేకత మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు మెగా అభిమానులు భైరవం మూవీని బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దర్శకుడి చర్యలు అందుకు కారణం అయ్యాయి. కంటెంట్ ఉంటే ఎవరూ మూవీని ఆపలేరని ఆ చిత్ర యూనిట్ నమ్ముతుంది. ఈ క్రమంలో భైరవం మూవీలో విషయం ఉందా? ఆడియన్స్ ని మెప్పించిందా?. ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం.

భైరవం తమిళ చిత్రం గరుడన్ కి అధికారిక రీమేక్. ఓ పొలిటికల్ లీడర్ నుండి తమ గ్రామంలోని దేవాలయాన్ని ముగ్గురు యువకులు ఎలా కాపాడుకున్నారు అనేది కథ. ఆ ముగ్గురు యువకుల పాత్రల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించారు. మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి పదేళ్లు అవుతుంది. నారా రోహిత్ ఫేడ్ అవుట్ దశలో ఉన్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం హిట్ కొట్టి ఏళ్ళు గడచిపోతుంది. దాంతో ఈ ముగ్గురికి భైరవం కమ్ బ్యాక్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భైరవం మూవీకి మిశ్రమ స్పందన దక్కుతుంది. మూవీ పర్లేదు. ఒకసారి చూడొచ్చు అంటున్నారు ఆడియన్స్. భైరవం మూవీ రొటీన్ కథ. దానికి తోడు స్క్రీన్ ప్లే సైతం తేలిపోయింది. ప్రెడిక్టబుల్ నెరేషన్ కారణంగా, కథనం ఏమంత ఆసక్తిగా సాగదు. ఫస్ట్ హాఫ్ నిరాశపరుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. అనవసరమైన ఫైట్స్, హీరో ఎలివేషన్ సీన్స్ డ్రామాను దెబ్బ తీశాయి. సాంగ్స్, లవ్ ట్రాక్ సైతం ఏమంత ఆసక్తిగా ఉండదు. అయితే అక్కడక్కడ హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి.

మొత్తంగా భైరవం పర్లేదు. ఒకసారి సదరు హీరోల అభిమానులు చూసి ఎంజాయ్ చేయవచ్చు. అంచనాలు మాత్రం భైరవం మూవీ అందుకోలేకపోయిందని మెజారిటీ అభిమానుల అభిప్రాయం. ఇక బాక్సాఫీస్ వద్ద మూవీ ఈ స్థాయి విజయం సాధిస్తుందో… వీకెండ్ ముగిస్తే కాని తెలియదు.

RELATED ARTICLES

Most Popular