Bhairavam : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం దర్శక నిర్మాతలకు సక్సెస్ ఫార్ములాలు రెండే. ఒకటి మల్టీస్టారర్ చిత్రాలు, రెండవది సీక్వెల్స్. ఈ రెండిటికి ఆడియన్స్ థియేటర్స్ కు క్యూలు కట్టేస్తున్నారు. టాక్ కాస్త తేడాగా వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది. రీసెంట్ గా అలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాలపై అమితాసక్తి ని చూపిస్తున్నారు. చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) వంటి వారు కలిసి నటిస్తున్న చిత్రం ‘భైరవం’. తమిళం లో సూపర్ హిట్ గా నిచ్చిన ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్. అయితే ఈ సినిమాలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి బదులుగా వేరే హీరోల పేర్లను ముందుగా పరిశీలించారట.
Also Read : బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’ టీజర్ అదిరిపోయింది..ముగ్గురు హీరోలు కుమ్మేసారు..ఆఖరి షాట్ అరాచకం!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి బదులుగా విశ్వక్ సేన్(Vishwak Sen), నారా రోహిత్ కి బదులుగా మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja) ఈ చిత్రం లో నటించాల్సి ఉంది. ఇందులో మంచు మనోజ్ విలన్ క్యారక్టర్ చేస్తాడు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి మీడియా లో పెద్ద చర్చే నడిచింది. కానీ చివరికి వీళ్లిద్దరు ఎందుకో ఈ సినిమా నుండి తప్పుకున్నారు. రీమేక్ సినిమాలు ఈమధ్య కాలం లో వర్కౌట్ అవ్వడం లేదు అనేది వీళ్ళ వాదన. అందుకే వీళ్లిద్దరు ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళ స్థానంలోకి బెల్లంకొండా, నారా రోహిత్ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో ఈ నెలలో విడుదల అవ్వడం కష్టమే అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
మే 9న పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది అంటూ మేకర్స్ ఇది వరకే అధికారిక ప్రకటన చేసారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉంది. ఒకవేళ అనుకున్న సమయానికి అవి పూర్తి కాకపోతే వాయిదా పడే అవకాశాలు ఎక్కువ. అదే కనుక జరిగితే మే9న ‘భైరవం’ చిత్రాన్ని విడుదల చేస్తారట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అదే రోజున మరో రెండు మూడు చిత్రాలు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్ ని ఎంత వరకు అలరిస్తుంది అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నే. హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటిస్తుంది.
Also Read : స్టార్ హీరోలు గడ్డం పెంచితే సినిమా సూపర్ హిట్ అవుతుందా..?