Bhagwant Kesari : భగవంత్ కేసరిలో ఆ ఒక్క పాట డిలీట్ తో నిర్మాత ఎన్ని కోట్లు లాస్ నో తెలుసా?

దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. శ్రీలీల కీలక రోల్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Written By: NARESH, Updated On : October 19, 2023 10:14 pm

Bhagavanth-Kesari-2222

Follow us on

Bhagwant Kesari : భగవంత్ కేసరి మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో దిగనుంది. బాలకృష్ణ గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో భగవంత్ కేసరిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ట్రెండు ప్రీ రిలీజ్ బిజినెస్ లో కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 51 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్మారు. వరల్డ్ వైడ్ రూ. 65 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ అనవచ్చు. భారీ టార్గెట్ తో బాలయ్య దిగుతున్నాడు. రూ. 66 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే కానీ సినిమా హిట్ స్టేటస్ అందుకోదు.

అయితే విడుదలకు ముందే నిర్మాతలకు కోట్ల నష్టం మిగిల్చినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణ అందుకు కారణమయ్యారు. హీరోయిన్ కాజల్-బాలయ్య మీద ‘దంచవే మేనత్త కూతురా’ సాంగ్ రీమిక్స్ తెరకెక్కించారు. ఈ సాంగ్ ని విడుదలైన వారం అనంతరం సినిమాలో పెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయం దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ మూవీలో కమర్షియల్ సాంగ్స్ లేవని. కథ రీత్యా ఆ తరహా సాంగ్స్ పెట్టలేదన్నారు.

అయితే బాలయ్య ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక మాస్ సాంగ్ సిద్ధం చేశామని అది దసరా పండగ రోజు విడుదల చేస్తాం. ప్రేక్షకులు థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అయితే ఈ ఆలోచన పూర్తిగా విరమించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. కథకు ఏ మాత్రం నప్పని ఆ సాంగ్ పెట్టడం వలన సినిమాకు ప్లస్ కాకపోగా మైనస్ అవుతుంది. ప్రేక్షకులకు అతికించిన భావన కలిగే అవకాశం ఉంది. అందుకే దంచవే మేనత్త కూతురా సాంగ్ సినిమాలో పెట్ట కూడదని నిర్ణయించారట.

ఈ సాంగ్ చిత్రీకరణకు నిర్మాతలు రూ. 3.5 కోట్లు ఖర్చు చేశారట. ఆ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందంటున్నారు. దంచవే మేనత్త కూతురా రీమిక్స్ చేయాలనేది దర్శకుడు ఆలోచనో… బాలయ్య సలహానో తెలియదు కానీ, నిర్మాతకు పెద్ద బొక్క పడింది. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. శ్రీలీల కీలక రోల్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.