Bhagavanth Kesari: వరుస విజయాలతో జోరు మీదున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన గత చిత్రాలు అఖండ, వీర సింహారెడ్డి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టింది లేదు. చాలా ఏళ్ల తర్వాత రేర్ ఫీట్ అని చెప్పాలి. ఇక భగవంత్ కేసరి చిత్రంతో హ్యాట్రిక్ పై కన్నేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టీజర్ అదిరిపోగా బాలయ్యకు మరో హిట్ గ్యారంటీ అంటున్నారు.
దసరా బరిలో దిగుతున్న భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్స్ షురూ చేశారు చిత్ర యూనిట్. సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్ ఎప్పుడని బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్టోబర్ 8న భగవంత్ కేసరి ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ మేరకు యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. భగవత్ కేసరి ట్రైలర్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. భగవంత్ కేసరి ట్రైలర్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ అయ్యే అవకాశం కలదంటున్నారు.
భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల ప్రధాన పాత్ర చేస్తుంది. భగవంత్ కేసరిలో కాజల్ పాటలకు మాత్రమే పరిమితం అన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు లేదు. సాంగ్స్ లో కూడా శ్రీలీలనే కనిపిస్తుంది. బాలకృష్ణ శ్రీలీల బాబాయ్ రోల్ చేస్తున్నారని సమాచారం.
కథ బాలకృష్ణ-శ్రీలీల చుట్టూ తిరుగుతుందట. భగవంత్ కేసరి తెలంగాణ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. నెక్స్ట్ బాలయ్య దర్శకుడు బాబీతో మూవీ కమిట్ అయ్యారు. అధికారిక ప్రకటన కూడా జరిగింది. అలాగే అన్ స్టాపబుల్ సీజన్ 3కి రంగం సిద్ధం అవుతుందట. దసరాకు ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుందని అంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి సంబరాలు అని చెప్పాలి.
Gear up for #BhagavanthKesari’s explosive extravaganza Like Never Before
TRAILER OUT ON OCT 8th❤️
This time, beyond your imagination
In Cinemas from October 19th#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @rampalarjun @sahugarapati7… pic.twitter.com/s5Dle3Cm79
— Shine Screens (@Shine_Screens) October 5, 2023