Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి వసూళ్ల ఊచకోత… మూడు రోజులకు అన్ని కోట్లా!

రెండో రోజు వసూళ్ల కంటే మూడో రోజు వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని నిర్మాతల ప్రకటించారు. ఈ క్రమంలో మూడు రోజులకు భగవంత్ కేసరి రూ.71.02 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిందట. అంటే మరో రెండు రోజుల్లో వంద కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయం.

Written By: NARESH, Updated On : October 22, 2023 2:28 pm

Bhagavanth Kesari Collections

Follow us on

Bhagavanth Kesari Collections: దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాల్లో భగవంత్ కేసరి విన్నర్ అనిపించుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బాలయ్య మూవీ సత్తా చాటుతుంది. నిర్మాతల లెక్కల ప్రకారం భగవంత్ కేసరి వంద కోట్లకు చేరువలో ఉంది. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో విడుదలైన భగవంత్ కేసరి ఫస్ట్ డే రూ.32.33 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఇక రెండు రోజులకు రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట.

రెండో రోజు వసూళ్ల కంటే మూడో రోజు వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని నిర్మాతల ప్రకటించారు. ఈ క్రమంలో మూడు రోజులకు భగవంత్ కేసరి రూ.71.02 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిందట. అంటే మరో రెండు రోజుల్లో వంద కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయం. భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 కోట్లకు అమ్మారు. వరల్డ్ వైడ్ రూ. 66 కోట్ల వరకూ బిజినెస్ చేసిందని సమాచారం.

అంటే భగవంత్ కేసరి రూ. 67 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్ బొమ్మ అవుతుంది. మూడో రోజు తెలుగు ఏపీ/తెలంగాణాలలో కలిపి భగవంత్ కేసరి రూ. 10.65 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ప్రకటించారు. అయితే ట్రేడ్ వర్గాల లెక్కలకు నిర్మాతల ప్రకటనకు పొంతన లేదు. ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ కి రెండు మూడు రెట్లు అధికంగా నిర్మాతలు ప్రకటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మేము చెప్పే వసూళ్ల లెక్కలన్నీ ఫేక్ అని ఒప్పుకున్నాడు.

అసలు వసూళ్లు డిస్ట్రిబ్యూటర్స్ కి మాకు తప్పితే ఎవరికీ తెలియదు. ఒరిజినల్ వసూళ్ళు బయటపెట్టం అన్నారు. భగవంత్ కేసరి విషయంలో నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తున్నారని ఈజీగా అర్థం అవుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్లో భగవంత్ కేసరి తెరకెక్కింది. శ్రీలీల కీలక రోల్ చేయగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందించాడు.