Hero Nikil: హీరోయిన్ హెబ్బా పటేల్ కుమారి 21ఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఐతే, మెచ్యూరిటీ లేకపోవడం కారణంగానో.. లేక, వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆశ కారణంగానో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసింది. ఈ క్రమంలో హెబ్బా పటేల్ ఫామ్ కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడింది. అయితే, అనుభవం నేర్పిన పాఠాలతో మళ్ళీ కెరీర్ ను స్టార్ట్ చేసింది హెబ్బా పటేల్.

నిఖిల్ హీరోగా కొత్త దర్శకుడు డైరక్షన్ లో రాబోతున్న సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఈ మూవీలో ఆల్రెడీ నభా నటేష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. కాగా ఓ పక్క సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా హెబ్భా పటేల్ నటిస్తుంది. నభా నటేష్ – హెబ్భా పటేల్ ఇద్దరి మధ్య నిఖిల్ నలిగిపోతాడట.

ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఈసారి నిఖిల్ ఫుల్ ఫన్ తో నటిస్తాడు అని, అలాగే నిఖిల్ భారీ హిట్ తో అదరగొట్టడం ఖాయమని అంటున్నారు మేకర్స్. మొత్తానికి నిఖిల్ స్పీడ్ పెంచాడు. మరి నిఖిల్ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఫలితాలు ఎలా ఉన్నా.. హెబ్బా పటేల్ కి మాత్రం ఇది గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఎన్నో కష్టాలు, అవమానాలు తర్వాత హెబ్బా ఈ సినిమా చేస్తోంది.
గతంలో నితిన్ నటించిన ‘భీష్మ’ వంటి సినిమాల్లో హెబ్బా ఐటమ్ పాత్ర కూడా చేసింది. అయితే ఐటమ్ పాత్రల్లో ఎందుకు కనిపించారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తనను హేళన చేస్తున్నారని.. ఒక హీరోయిన్ తన కెరీర్ ను మెయింటైన్ చేయాలి అంటే.. చాలా ఉంటాయని, దానికి బోలెడంత డబ్బు అవసరం అవుతుంది అని, ఆ డబ్బు తన దగ్గర లేదని, అందుకే తానూ అలాంటి పాత్రలు కేవలం డబ్బు కోసమే చేశానని చెప్పుకొచ్చింది.
కథలు నచ్చకపోయినా, నేను చేసే పాత్రల పై అసహ్యం కలిగినా నటించాను అని కుండబద్దలు కొడుతోంది హెబ్బా. అయితే ఇక నుండి నటిగా సంతృప్తినిచ్చే పాత్రలనే చేస్తోందట. అన్నట్టు హెబ్బా త్వరలోనే ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే డ్రామాలో కనిపించనుంది. ఈ డ్రామాలో హెబ్బాది సగటు గృహిణి పాత్ర. గ్లామర్ లేని పాత్ర. మొత్తానికి హెబ్బాలో చాల మార్పు వచ్చింది.