Horror Movies
OTT : ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ కి డిమాండ్ పెరిగింది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు చూసే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక్కడ మనకు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే చాలా మందికి హారర్ సినిమాలు చూడటం అంటే ఇష్టం. ఓవైపు భయపడుతూనే ఈ మూవీస్ చూస్తుంటారు. కొందరు మిడ్ నైట్ లో ఒంటరిగా హారర్ మూవీ చూస్తూ థ్రిల్ అవుతుంటారు.
అలాంటి వారి కోసం ఓటీటీల్లో వందల సంఖ్యలో హారర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నుంచి ది బెస్ట్ 12 సినిమాల వివరాలు సేకరించడమైనది. ఈ చిత్రాలు ఒంటరిగా ఉన్నప్పుడు చూశారంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. హర్రర్ సినిమాలు ఇష్టపడే వారు తప్పకుండా చూడాల్సిన మూవీస్ ఇవి. ఆ సినిమాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..
1. మణిచిత్ర తాళు 1993 – బ్లాక్ బస్టర్ ‘చంద్రముఖి ‘ చిత్రానికి ఇది ఒరిజినల్. మాలయంలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
2. 13బీ 2009 – ఇదో డబ్బింగ్ సినిమా. ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తీశారు. కాగా ఇది హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
3. అరుంధతి 2009 – హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా. బాలీవుడ్ నటుడు సోనూసూద్ పశుపతి క్యారక్టర్ లో వదల బొమ్మాళీ అంటూ అప్పట్లో తెగ భయపెట్టాడు. అమెజాన్ ప్రైమ్ లో అరుంధతి స్ట్రీమింగ్ అవుతుంది.
4. భ్రమ యుగం 2024 – తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళ హారర్ మూవీ. కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంట్లో జరిగిన కథగా తీశారు. సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.
5. పిజ్జా 2012 – విజయ్ సేతుపతి ని స్టార్ గా నిలబెట్టిన సినిమా ఇది. పిజ్జా డెలివరీ బాయ్ కి ఎదురైన వింత సంఘటనలు కథ. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.
6. భూతకాలం 2022 – దెయ్యాన్ని ఏమాత్రం చూపించకుండా వణుకుపుట్టించే సినిమా. ఇది మలయాళ చిత్రం. కానీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది.
7. మసూద 2022 – అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన తెలుగు సినిమా. ఆహా లో అందుబాటులో ఉంది. చూస్తే ఒక్కో సీన్ కి గుండె ప్యాంటు లోకి జారిపోతుంది.
8. హౌస్ ఆఫ్ సీక్రెట్స్ 2021 – ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తీశారు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది.
9. తుంబాడ్ 2018 – అత్యాశ మనిషిని ఎలా నాశనం చేస్తుంది అనే దానికి హారర్ జోడించి తీసిన సినిమా. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
10. కౌన్ 1999 – సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రోపొందించిన హిందీ సినిమా. ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్ లోనే ఉంది.
11. గృహం 2017 – సిద్దార్థ్ నటించిన ఈ మూవీ చాలా భయపెట్టే విధంగా ఉంటుంది. జియో సినిమా తో పాటు యూట్యూబ్ లో కూడా తెలుగులో అందుబాటులో ఉంది.
12. డిమోంటి కాలనీ 2015 – ఓ బంగ్లాలో జరిగే వింత కథతో తీసిన సినిమా. కాగా ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అందుబాటులో ఉంది.
Web Title: Best horror movies in ott do not miss interesting details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com