నిజానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలతో ఎప్పుడో పరిచయం అయ్యాడు. కాకపోతే యూట్యూబ్ లో మాత్రమే అతని సినిమాలకు కొన్ని వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ వ్యూస్ ను చూసి స్టార్ డమ్ ను లెక్క వేయలేం కాబట్టి.. ప్రస్తుతానికి అయితే, సాయి శ్రీనివాస్ భారీగా ఖర్చు పెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం రిస్క్ అనే చెప్పాలి.
కాకపోతే, ఈ సారి ఆ రిస్క్ ను షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు కూడా భాగస్వామ్యం కానున్నారు. మొత్తానికి ఈ సినిమాని బారీ స్థాయిలో తీయడానికి ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నటీనటులను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తీసుకోవాలని ఆశ పడుతున్నారు. మరి హీరోయిన్ని ఎవర్ని తీసుకోవాలి ?
ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. వాస్తవానికి బాలీవుడ్ టాప్ హీరోయిన్లనందరిని అడిగినా ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు. సాయి శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా చేస్తే.. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలకు దూరం అవ్వాల్సి వస్తోంది అనేది హీరోయిన్ల భయం. దీనికితోడు ఒకరు ఇద్దరు హీరోయిన్లు చేయాలని ఆసక్తి చూపించినా.. పారితోషికం నచ్చక సైడ్ అయిపోతున్నారు.
కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్నే తీసుకోవాలనేది బెల్లంకొండ కుర్రాడు పట్టుదల. మరి చూడాలి ఏ బాలీవుడు హీరోయిన్ ఒప్పుకుంటుందో ? ఈ హిందీ సినిమాకి, దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకుడు కావడం విశేషం.