Bellamkonda Sreenivas: ప్రభాస్ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా, అలాగే ప్రభాస్ ను టాలీవుడ్ లో రెబల్ స్టార్ ను చేసిన సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అయితే, బాలీవుడ్ ఎంట్రీ కోసం చిరంజీవి ఫార్ములానే బెల్లంకొండ శ్రీను కూడా ఫాలో అవుతున్నాడు. అప్పట్లో రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అంకుశం’ హిందీ రిమేక్ ‘ప్రతిబంధ్’తో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు బెల్లంకొండ శ్రీను. కాగా తాజాగా హిందీ ‘ఛత్రపతి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నట్టు ఈ ఛత్రపతి ఒరిజినల్ కథను అందించిన విజయేంద్రప్రసాదే ఈ రీమేక్ కి కూడా కథను అందిస్తున్నాడు. హిందీ వెర్షన్ కి అనుకూలంగా కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ హిందీ చత్రపతి రీమేక్‌ను పెన్ స్డూడియోస్ భారీ స్థాయిలో అట్టహాసంగా నిర్మించబోతుంది.
Also Read: ‘సరిగమప’ సింగర్ పార్వతి బయోగ్రఫీ తెలుసా..?
ఇటు యాక్షన్, అటు ఎమోషన్ తో సాగే ఈ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. పైగా ఈ సినిమాకి అప్పట్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఎలాగూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా అతని దగ్గరకు వచ్చింది. అయితే పక్కా మదర్ సెంటిమెంట్ తో నడిచే కథతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఏ రేంజ్ సక్సెస్ వస్తుందో చూడాలి.

ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్టు పట్ల బెల్లంకొండ ఫ్యామిలీ బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. కాకపోతే కంటెంట్ పాతది. దానికి తోడు భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. పెద్దగా మాస్ ఇమేజ్ లేని తెలుగు హీరో మీద అసలు యాక్షన్ సీక్వెన్స్ ఎలా వర్కౌట్ అవుతాయా.. ? మరి.. హిందీ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో..? ఏది ఏమైనా సినిమా ప్రభాస్ ది.. ఫార్ములా చిరంజీవిది. మరి బెల్లండకొండకు కలిసి వస్తోందా ? చూడాలి.
Also Read: హిందీలోకి భీమ్లానాయక్.. అక్కడ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే