https://oktelugu.com/

Rashmika Mandanna : ఆ విషయం లో రష్మిక కంటే వెనకబడి పోయిన మృణాల్…

మరి 'ఫ్యామిలీ స్టార్' సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి ఇక మీదట ఆమె చేసే సినిమాల విషయం లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2024 8:01 pm
    vijay-deverakonda-rashmika-manda

    vijay-deverakonda-rashmika-manda

    Follow us on

    Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ టైమ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే…ఇక హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల స్టార్ డమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో సీతారామం సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా యూత్ లో అయితే ఆమె ఒక అందాల రాణిగా ఆమెను పూజించే అభిమానులు కూడా ఉన్నారు.

    మరి మృణాల్ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాయి. నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ కి ఈ సినిమా ఏ రకంగా ఉపయోగపడలేదు. అయితే ఈ సినిమా ఆవరేజ్ గా ఆడినప్పటికీ నాని ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని కొట్టేయడంతో ఈ సినిమా ఏ రకం గాను ఆమెకు కలిసి రాలేదు. ఇక ఇప్పుడు పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో అయిన తను మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలి అనుకుంది. కానీ ఈ సినిమాకి కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈమెకి ఈ సినిమా కూడా ఏ రకంగానూ ఉపయోగపడడం లేదు.

    ఒక రకంగా చెప్పాలంటే రష్మిక మందనాకి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే వరుసగా మూడు, నాలుగు సక్సెస్ లు పడడంతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ విషయంలో ఠాకూర్ కొద్దిగా వెనుకబడిపోయిందనే చెప్పాలి. అందమైన రూపంతో, క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో ఎలాంటి క్యారెక్టర్ లో అయిన ఒదిగిపోయి నటించేంత మంచి పేరు సంపాదించుకున్న కూడా ఇండస్ట్రీలో సక్సెస్ లు మాత్రం రావడం లేదు. ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట.

    ఇక సక్సెస్ ఉన్నవాళ్లకే స్టార్ డమ్ వస్తుంది. వాళ్లకే రెమ్యూనరేషన్ పరంగా కూడా చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి తమ సినిమాల్లోకి ప్రొడ్యూసర్లు, దర్శకులు వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. మరి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి ఇక మీదట ఆమె చేసే సినిమాల విషయం లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…