Before Sleeping: పగలంతా అధిక పని ఒత్తిడి కారణంగా చాలామంది అలసిపోయి సాయంత్రం త్వరగా నిద్రపోతుంటారు.అయితే నిద్రపోయేముందు చాలా మందికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం పడుకోవడం, కొన్ని పానీయాలు సేవించి పడుకోవడం చేస్తుంటారు. కొందరు తిన్న వెంటనే నిద్ర పోతూ ఉంటారు. ఇలా నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న లేకపోతే కొన్ని పనులను చేసిన భవిష్యత్తులో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పనులు ఏమిటి ఆ పనులు చేయటం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
రాత్రి పడుకునే ముందు చాలామంది మసాలా కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుని ఆ వెంటనే నిద్రపోతారు. ఇలా నిద్ర పోవటం వల్ల అసిడిటీ, అజీర్తి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా తిన్న వెంటనే నిద్ర పోవటం వల్ల అధిక శరీర బరువు పెరగడమే కాకుండా గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే నిద్రపోయే ముందు చాలా మంది మందు తాగుతారు. ఇలా మద్యం సేవించడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధ పడాల్సి వస్తుంది.
Also Read: పిల్లల విజయంలో తండ్రిది కీలక పాత్రేనా?
ఇక చాలామంది వారికి నిద్ర వచ్చే వరకు కంప్యూటర్లు ముందు లేదా సెల్ ఫోన్ లో కాలక్షేపం చేస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం అని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా రాత్రులు ఎక్కువ సమయం పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు ముందు కూర్చోవడం వల్ల కంటిచూపు సమస్యలు రావడమే కాకుండా మరెన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. అందుకే నిద్ర పోయేటప్పుడు ఎక్కువగా మసాలా కలిగిన ఆహార పదార్థాలను తినకూడదు. మనం నిద్ర పోవడానికి రెండు గంటల ముందు భోజనం చేసి ఆ తర్వాత నిద్ర పోవడం వల్ల మన ఆరోగ్యం కాపాడుకున్న వారమవుతాము.
Also Read: రైల్వే ట్రాక్ పై కంకర రాళ్ళు వేయడానికి కారణం ఏమిటో తెలుసా?